Begin typing your search above and press return to search.

అయ్యబాబోయ్ ఐటెం పిల్ల చంపేసిందిగా..

By:  Tupaki Desk   |   6 Aug 2016 7:30 PM GMT
అయ్యబాబోయ్ ఐటెం పిల్ల చంపేసిందిగా..
X
తెలుగులో టెంపర్ - బాహుబలి వంటి సినిమాల్లో ఐటెం సాంగులకు చిందులేసి యమా పాపులర్ అయ్యింది మొరాకన్ హాటీ నోరా ఫతేహి. తరువాత ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదులే. అయితే ఆమె మాత్రం హాట్ లుక్సులో ఎవ్వరికీ తీసిపోదు. అవకాశాలు రావడమే తరువాయి. ఇంతకీ ఇప్పుడు అమ్మడు ఏం చేస్తోందో తెలుసా?

ఒక ప్రముఖ హిందీ చానల్ లో వస్తున్న జలక్ దిక్లా జా.. అనే ప్రోగ్రామ్ సీజన్ 9 లో నోరా ఫతేహి కూడా ఒక డ్యాన్సర్ గా అడుగుపెట్టింది. కపుల్స్ క్యాటగిరీలో ఈసారి ఎలాగైనా కిరీటం గెలుచుకోవాలని ఆశిస్తోంది ఈ అమ్మడు. ఇంట్రొడక్షన్ యాక్ట్ కోసం అమ్మడు తన ఒంపుసొంపులతోనే కాదు.. ఆ రిథమిక్ స్టెప్పులతో తన స్ర్పింగులాంటి బాడీని లయబద్దంగా అలా నాట్యపు అలలపై తేలియాడాలే చేస్తుంటే.. వావ్ అనుకోవాల్సిందే మనం. ఆ పోటోలు చూస్తుంటే మీకే అర్ధమవుతోందిగా అమ్మడి క్రేజీ లుక్స్ ఎలా పిచ్చెత్తిస్తాయో. ఈ ప్రోగ్రాం చూసిన తెలుగు ఆడియన్స్ అందరూ.. ఈ ఐటెం పిల్ల చంపేసిందే అంటున్నారు.

తెలుగులో ప్రస్తుతం ఓ రెండు పెద్ద సినిమాల్లో అమ్మడు ఐటెం సాంగులు చేస్తోందని తెలుస్తోంది. అయితే జనతా గ్యారేజ్ లో కూడా ముందుగా నోరా ఫతేహితో ఐటెం పాట చేయించాలని అనుకున్నా.. చివరకు కాజల్ ను ఆ స్థానంలో దించేశారు.