Begin typing your search above and press return to search.

నోరా ఫతేహి.. స్పెషల్ షో అదుర్స్..!

By:  Tupaki Desk   |   7 Nov 2022 1:30 PM GMT
నోరా ఫతేహి.. స్పెషల్ షో అదుర్స్..!
X
బాలీవుడ్ స్పెషల్ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రెస్ గా మారింది హాట్ బ్యూటీ నోరా ఫతేహి. మోడల్ గా కెరియర్ మొదలు పెట్టి మ్యూజిక్ వీడియోస్ తో బీ టౌన్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసిన ఈ అమ్మడు సౌత్ సినిమాల్లో కూడా స్పెషల్ అప్పియరన్స్ ఇస్తుంది. ఐటం సాంగ్స్ చేస్తే తనే చేయాలి అన్న రేంజ్ లో నోరా ఫతేహి గ్లామర్ షో ఉంటుంది. ఎలాగు అమ్మడు చేస్తున్న సాంగ్స్ కూడా సినిమాకు ప్లస్ అవుతున్నాయి.. సినిమాలు మంచి ఫలితాలు అందుకోవడంతో నోరాకి డిమాండ్ పెరుగుతూ వచ్చింది.

బాలీవుడ్ లో మాత్రమే కాదు తెలుగులో కూడా నోరా స్పెషల్ సాంగ్స్ అలరిస్తున్నాయి. స్టార్ సినిమాలో స్పెషల్ సాంగ్ అంటే ఎవరైనా హీరోయిన్ చేస్తే ఓకే లేదంటే నోరాని దించేస్తున్నారు మన వాళ్లు. ఈ అటెన్షన్ ని మరింత కొనసాగించాలని సినిమాలో సాంగ్స్ తోనే కాదు సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ తో కూడా రెచ్చిపోతుంది నోరా ఫతేహి.

రీసెంట్ గా ఫ్రెండ్స్ గ్యాంగ్ తో బోట్ షికారు వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసిన అమ్మడు లేటెస్ట్ గా రెడ్ హాట్ డ్రెస్ లో ఆడియన్స్ ని టెంప్ట్ చేసేలా అందాల కిక్ ఇస్తుంది. గ్లామర్ ట్రీట్ అందిచడంలో తన స్టైల్ వేరే అని చాటిచెబుతున్న నోరా తన ఫోటో షూట్స్ తో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.

బాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్ లు చేస్తూ వస్తున్న నోరాకి లేటెస్ట్ గా తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాలో ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. అ సినిమాలో అమ్మడికి స్పెషల్ సాంగ్ ఆఫర్ ఇచ్చారట డైరక్టర్ క్రిష్. తెలుగులో బాహుబలిలో ఇరుక్కుపో సాంగ్ చేసి తెలుగు ఆడియన్స్ ని అలరించిన నోరా ఇక మీదట ఎలాంటి ఛాన్స్ వచ్చినా చేస్తానని అంటుంది.

మ్యూజిక్ వీడియోస్, స్పెషల్ సాంగ్స్ మాత్రమే కాదు ఆమె మోడల్ గా కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఎక్కువగా అమెని స్పెషల్ ఐటం సాంగ్స్ తోనే క్రేజ్ తెచ్చుకోవడంతో అమ్మడికి అలాంటి అవకాశాలే ఇస్తున్నారు.

ఏది ఏమైనా నోరా చేస్తున్న ఈ అందాల ప్రదర్శకి చూస్తుంటే అమ్మడికి హీరోయిన్ ఛాన్స్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఏముంది కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు డ్యాన్స్ చేసి అలరించినట్టే అప్పుడు యాక్టింగ్ తో కూడా ఆకట్టుకుంటుంది నోరా.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.