Begin typing your search above and press return to search.

ఫేమ‌స్ సింగ‌ర్ తో నోరా ప‌తేహీ రొమాన్స్!

By:  Tupaki Desk   |   19 Dec 2021 2:30 AM GMT
ఫేమ‌స్ సింగ‌ర్ తో నోరా ప‌తేహీ  రొమాన్స్!
X
మ‌ల్టీ ట్యాలెంటెడ్ గురు రంధ‌వా దేశ వ్యాప్తంగా ఎంత ఫేమ‌స్ సింగ‌ర్ అన్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. సింగ‌ర్ గా..లిరిసిస్ట్ గా..కంపోజర్ గా ఆయ‌న‌కు మంచి పేరుంది. పంజాబీ.. భాంగోరా..ఇండీ-పాప్ సింగ‌ర్ గా ఎంతో ఫేమ‌స్. బాలీవుడ్ లోనూ చాలా చిత్రాల‌కు గాత్రం అందించారు. తాజాగా బాలీవుడ్ ఆటం బాంబ్ నోరా ప‌తేహీ తో జంట‌గా న‌టిస్తోన్న `డాన్స్ మేరి రాణి` అనే పాట‌తో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతున్నారు.

తాజాగా ఆ పాట‌కు సంబంధించిన ప్ర‌మోష‌న‌ల్ పోస్ట‌ర్ రిలీజ్ అయింది. ఇందులో నోరా ప‌తేహీ స్టైలిష్ డిజైన్ లుక్ ఒక‌టి వైర‌ల్ గా మారింది. నోరా ప‌తేహీ ధ‌రించిన కాస్ట్యూమ్స్ చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. నోరా గోల్డ్ క‌ల‌ర్ క‌ర్లీ హెయిర్ స్టైల్ ..మ్యాచింగ్క దుస్తుల్లో ఆక‌ట్టుకుంటుంది. ఈ దుస్తుల్లో నోరా థై అందాలు ఎలివేట్ అవుతున్నాయి. ఈనెల 21న సాంగ్ కి సంబంధించిన టీజ‌ర్ రిలీజ్ చేస్తున్న సంద‌ర్భంగా ఈపిక్ ని యూనిట్ రిలీజ్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో నోరా అభిమానుల్ని ఆక‌ట్టుకుంటుంది. నోరా అభిమానులు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

ప్ర‌స్తుతం నోరా ప‌తేహీ మ‌నీలాండ‌రింగ్ కేసులో ఈడీ విచార‌ణ‌ని ఎదుర్కోంటున్న సంగ‌తి తెలిసిందే. ఏ1 ముద్దాయిగా ఉన్న సుకేంష్ చంద్ర తో నోరా స‌న్నిహిత సంబంధం క‌లిగి ఉంద‌ని ఈడీ విచార‌ణ‌లో తేలింది. నోరా పేరిట ఖ‌రీదైన కార్లు బ‌హుమ‌తిగా ఇవ్వ‌డం స‌హా ప‌లు అంశాల్లో నోరా అడ్డంగా బుక్కైంది. ఆమెతో పాటు శ్రీల‌కం బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా విచార‌ణ ఎదుర్కోంటున్న సంగ‌తి తెలిసిందే.