Begin typing your search above and press return to search.

ఫిలింఫేర్ ని షేక్ చేసిన బాహుబ‌లి మ‌నోహ‌రి!

By:  Tupaki Desk   |   29 March 2021 4:01 AM GMT
ఫిలింఫేర్ ని షేక్ చేసిన బాహుబ‌లి మ‌నోహ‌రి!
X
త‌న‌దైన అందం డ్యాన్సింగ్ విన్యాసాల‌తో మెరుపులు మెరిపించ‌డం నోరా ఫ‌తేహికి కొత్తేమీ కాదు. ఇంత‌కుముందు బాహుబ‌లి చిత్రంలో మ‌నోహ‌రి గీతంలో నోరా నృత్యాల‌కు తెలుగు యువ‌త స‌హా దేశ‌వ్యాప్తంగా యూత్ ఫిదా అయిపోయారు.

ఇక ఈవెంట్ ఏదైనా.. రియాలిటీ షో ఏదైనా నోరా అక్క‌డ వాలిపోవాల్సిందే. అవార్డు వేడుక‌ల్లో అద్భుత నృత్యంతో మెరిపించ‌డం నోరాకు వెన్న‌తో పెట్టిన విద్య‌. ఇప్పుడు అంతా అవార్డుల‌ సీజన్. ఈ సీజ‌న్ లో వ‌రుస‌గా ఈవెంట్ల‌లో నోరా మెరుస్తోంది. ఇటీవల జరిగిన ఫిల్మ్‌ఫేర్ 2020-21 అవార్డుల కార్య‌క్ర‌మంలో నోరా ఫతేహి వేడెక్కించే వస్త్రధారణ హైలైట్ గా నిలిచింది. ఈ వేడుక‌ల్లో నోరా షో స్టాప‌ర్ గా నిలిచింది.

వేడుక ఆద్యంతం క‌ళ్ల‌న్నీ నోరా ధ‌రించిన డిజైన‌ర్ డ్రెస్ పైనే. పాపుల‌ర్ డిజైనర్ జార్జెస్ చక్ర రూపొందించిన మెటాలిక్ దుస్తుల్లో నోరా క‌వ్వింత హీట్ పెంచింది. సిల్వ‌ర్ గోల్డ్ మిశ్ర‌మ రంగుల‌తో మెటాలిక్ గౌనులో త‌ళ‌త‌ళా మెరిసిపోయిన నోరా థై స్లిట్ లుక్ తో అమాంతం అగ్గి రాజేసింది. నోరా మ‌త్తు క‌ళ్ల‌తో యూత్ గుండెల్లోకి దూసుకెళ్లింది. నిగనిగలాడే పెదవుల‌తో .. డైమండ్ స్టడ్ చెవిరింగులతో స్పెష‌ల్ గా క‌నిపించింది నోరా. ఈ అద్భుతమైన ఫోటోని ఇన్ స్టాగ్రామ్ ‌లో పంచుకున్న నోరా దానికి ఆస‌క్తిక‌ర‌ క్యాప్ష‌న్ ని ఇచ్చింది. నోరా ప్ర‌స్తుతం బాలీవుడ్ లో ప‌లు క్రేజీ సినిమాల్లో న‌టిస్తోంది. త్వ‌ర‌లో క‌థానాయిక‌గానూ స‌త్తా చాటేందుకు ప్లాన్ లో ఉంద‌ని తెలిసింది.