Begin typing your search above and press return to search.

బాలయ్య సినిమాలో బాహుబలి బ్యూటీ విలనిజం

By:  Tupaki Desk   |   6 March 2023 11:24 PM IST
బాలయ్య సినిమాలో బాహుబలి బ్యూటీ విలనిజం
X
అఖండ.. వీర సింహారెడ్డి సినిమాల తర్వాత బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న బాలయ్య 108 సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల నటిస్తున్నట్లు కూడా ఇప్పటికే క్లారిటీ వచ్చింది.

తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ... బాహుబలి సినిమాలో ఐటం సాంగ్‌ చేసిన నోరా ఫతేహీ కీలక పాత్రలో కనిపించబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. సినిమాలో ఆమె పాత్ర నెగటివ్ షేడ్స్ టచ్‌ తో ఉండబోతుందట. అంతే కాకుండా ఆమె పాత్ర కథకు అత్యంత కీలకంగా ఉంటుందని సమాచారం అందుతోంది.

నెగటివ్ షేడ్స్ ఉండే పాత్ర కోసం పలువురు ముద్దుగుమ్మలను పరిశీలించిన దర్శకుడు అనిల్‌ రావిపూడి చివరకు బాలీవుడ్‌ బ్యూటీ నోరా ఫతేహీ ని ఎంపిక చేశారు అనే సమాచారం అందుతోంది. ఇంకా ఆమె షూట్‌ లో జాయిన్ అవ్వలేదు. త్వరలోనే మొదలు కాబోతున్న కొత్త షెడ్యూల్‌ లో ఆమె జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

బాలయ్య 60 ఏళ్ల వ్యక్తి పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. ఆ గెటప్ చూస్తేనే అభిమానులు పూనకాలతో ఊగిపోతారు అంటూ యూనిట్‌ సభ్యులు అంటున్నారు. కథ విషయంలో ఇప్పటికే పుకార్లు పెద్ద ఎత్తున షికార్లు చేస్తూ సినిమా స్థాయిని అమాంతం పెంచాయి.

సినిమా లో నోరా ఫతేహీ కూడా కనిపించబోతుంది.. ఆమె విలనిజం చూపించబోతుంది అంటూ వస్తున్న వార్తలు సినిమా స్థాయిని మరింత పెంచుతున్నాయి. ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని దర్శకుడు అనిల్ రావిపూడి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

బాలయ్య మొన్న సంక్రాంతికి వీర సింహారెడ్డి సినిమా తో వచ్చి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ దసరాకు మరోసారి విజయాన్ని నమోదు చేసుకుని హ్యాట్రిక్ కొట్టాలని బాలయ్య మరియు ఆయన అభిమానులు ఆశ పడుతున్నారు. మరి ఎంత వరకు బాలయ్య హ్యాట్రిక్ సాధ్యం అనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.