Begin typing your search above and press return to search.
మగాళ్ల బట్టల దుకాణంలో పని చేసిందట!
By: Tupaki Desk | 30 May 2022 1:30 AM GMTనోరా ఫతేహి బాలీవుడ్ లో నటిగా డ్యాన్సర్‌గా తన అద్భుతమైన కెరీర్‌తో గుర్తింపు పొందిన నటి. 2018లో బ్లాక్ బస్టర్ మ్యూజిక్ వీడియో దిల్బార్ లో నటించింది. ఇది యూట్యూబ్ లో ఒక బిలియన్ (100 కోట్ల) వీక్షణలతో సంచలనం సృష్టించింది. నోరాలో ఛామ్ ఫ్లెక్సిబిలిటీ డ్యాన్సింగ్ స్కిల్ ప్రతిదీ ప్రజలను విపరీతంగా ఆకర్షించాయి.
నోరా సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు అదనపు అవకాశాలను అందించింది ఈ పాట. భారత్ - స్త్రీ- బాట్లా హౌస్- రోర్ - సత్యమేవ జయతే వంటి అనేక బాలీవుడ్ చిత్రాలలో నోరా కనిపించింది. ప్రభాస్ బాహుబలి లో మనోహరిగా ఒక ఊపు ఊపింది. అయితే ఈ ఆకర్షణీయమైన రంగుల మాయా పరిశ్రమలోకి అడుగు పెట్టడానికి ముందు నోరా నిజజీవితంలో ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చింది అన్నది ఎందరికి తెలుసు? చాలా నిరాడంబరమైన జీవితాన్ని మాత్రమే కలిగి ఉందన్నది ఎవరికైనా తెలుసా?
కొద్దిసేపటి క్రితం కోమల్ నహతా చాట్ షో స్టార్రీ నైట్స్ జెన్ Y కార్యక్రమంలో నోరా 16 సంవత్సరాల వయస్సులో తాను ఉద్యోగ జీవితం ప్రారంభించడం గురించి వెల్లడించింది. ఆమె తన మొదటి ఉద్యోగం తన ఉన్నత పాఠశాల సమీపంలో ఉన్న ఒక మాల్ లో రిటైల్ సేల్స్ అసోసియేట్ గా మొదలైందని వెల్లడించింది.
నా కుటుంబంలో చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి అని తెలిపారు. చిన్న వయస్సులో తన కుటుంబాన్ని పోషించడానికి ఆమె రకరకాల ఉద్యోగాలు చేసానని వెల్లడించింది. తాను రెస్టారెంట్లు- బార్ లు -షావర్మా ప్లేస్ లలో వెయిట్రెస్ గా పనిచేశానని పురుషుల బట్టల దుకాణంలో కూడా పనిచేశానని నోరా చెప్పింది. నేను టెలిమార్కెటింగ్ కార్యాలయంలో పనిచేశాను.. ప్రజలకు కాల్ చేయడం .. లాటరీ టిక్కెట్లు అమ్మడం వంటివి చేసానని తెలిపింది.
ఇదిలా ఉండగా వృత్తిపరమైన రంగంలో నోరా ఫతేహి ప్రస్తుతం డ్యాన్స్ దీవానే జూనియర్స్ న్యాయమూర్తుల ప్యానెల్ లో జడ్జిగా కొనసాగుతోంది. డ్యాన్స్ దీవానే జూనియర్స్ అనేది కొత్త డ్యాన్స్ రియాలిటీ షో.. ఇది ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే బాగా ప్రాచుర్యం పొందింది.
ఇది పిల్లల డ్యాన్స్ రియాలిటీ షో.. ఇది ప్రతిభావంతులైన పిల్లల నృత్య నైపుణ్యాలను ప్రదర్శించడానికి విజేత ట్రోఫీని పొందడానికి భారీ వేదిక.. ఈ షోకు నోరా ప్రముఖ నటి నీతూ కపూర్ కొరియోగ్రాఫర్ మార్జి పెస్టోంజీ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. కంటెస్టెంట్స్ ని జడ్జి చేయడమే కాకుండా సెట్స్ లో చాలా సరదాగా గడుపుతున్నారు. నోరా రాకతో వేదిక గ్లామరస్ గా మారిపోతోంది.