Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9 లోకి టెంపర్‌ బ్యూటి

By:  Tupaki Desk   |   6 Dec 2015 6:12 AM GMT
బిగ్ బాస్ 9 లోకి టెంపర్‌ బ్యూటి
X
డబుల్ ట్రబుల్ కాన్సెప్ట్ తో ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 ప్రసారం అవుతోంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం అనేక వివాదాలకు, అలాగే వినోదాలకు కేంద్రం. ఈసారి టాలీవుడ్ కి బాగా తెలిసిన వాళ్లు కంటెస్టెంట్స్ గా ఉండడం విశేషం.

ఇప్పటికే మెగాస్టార్ సరనస అందరివాడులో కనిపించిన రిమ్మీసేన్.. బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంటర్ అయింది. త్వరలో ఎగ్జిట్ కూడా తీసేసుకోనుంది. ఇప్పుడీ హౌజ్ లోకి మోరాకో మోడల్‌ ఒకావిడ కూడా ఎంట్రీ ఇచ్చేస్తోంది. డిసెంబర్ 7నుంచి ప్రసారం అయ్యే ఎపిసోడ్స్ లో.. సెక్సీ బ్యూటి నోరా ఫతేహి కూడా దర్శనమివ్వనుంది. టాలీవుడ్ లో టెంపర్ తో అరంగేట్రం చేసిన ఈ వయ్యారి.. తర్వాత చాలానే ఆఫర్స్ దక్కించుకుంది. ఏకంగా బాహుబలిలోనూ చిందులేసి, తెలుగు ఇండస్ట్రీ సత్తాని ప్రపంచానికి చాటిన మూవీలో తనూ ఓ భాగం అయింది. ఆ తర్వాత కిక్2 - షేర్ మూవీల్లోనూ కనిపించి.. చిందులతో పాటు, అందాలను తెలుగు ప్రేక్షకులకు పంచింది.

ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో నోరాఫతేహి బిగ్ బాస్ లోకి ప్రవేశించడంతో.. తెలుగు జనాల్లో కూడా ఈ షోపై ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది. మరి ఈ సొగసరి ఎంతకాలం ఈ షోలో కొనసాగుతుందో.. లేక రిమ్మీ లాగానే ఎగ్జిట్ అయిపోతుందో చూడాలి.