Begin typing your search above and press return to search.
నాగ్ నుంచి ఒక్క ట్వీట్ కూడా లేదేంటీ?
By: Tupaki Desk | 23 July 2022 6:24 AM GMTనాగచైతన్య - దిల్ రాజు ల కలయికలో వచ్చిన మూవీ 'థాంక్యూ'. ఈ కాంబినేషన్ లో సినిమా రావడానికి పన్నెండేళ్లు పట్టింది. పన్నెండేళ్ల క్రితం నాగచైతన్యని హీరోగా పరిచయం చేస్తూ దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మూవీ 'జోష్'.
కింగ్ నాగార్జున కెరీర్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన 'శివ' స్ఫూర్తితో అదే తరహా కాలేజీ నేపథ్యాన్ని ఎంచుకుని వాసు వర్మని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ మూవీని నిర్మించారు. నాగచైతన్య క్యారెక్టర్ ని మించి సినిమాలో పెద్దగా కంటెంట్ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేక నిరుత్సాహ పరిచింది.
ఈ మూవీ వచ్చిన ఇన్నేళ్ల విరామం తరువాత నాగచయైతన్య తో దిల్ రాజు తాజాగా 'థాంక్యూ' మూవీని నిర్మించారు. అక్కినేని ఫ్యామిలీకి లైఫ్ లాంగ్ గుర్తుంచుకునే 'మనం' మూవీని అందించిన విక్రమ్ కె. కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
'ప్రేమమ్' మూవీని గుర్తు చేస్తూ అదే పంథాలో సాగిన ఈ మూవీ తాజాగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. బీవీఎస్ రవి చెప్పిన లైన్ ఆధారంగా రూపొందించిన తెరకెక్కిన ఈ మూవీ తొలి రోజే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుని నిరుత్సాహ పరిస్తోంది.
ఇదిలా వుంటే దాదాపు పన్నెండేళ్ల విరామం తరువాత చైతో దిల్ రాజు చేసిన సినిమాపై కింగ్ నాగార్జున నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. కనీసం ఓ ట్వీట్ కూడా ఆయన నుంచి రాకపోవడంతో పలువురు అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునకు ఈ మూవీ ఫలితం ముందే తెలుసు కాబట్టే ఆయన పెద్దగా స్పందించడానికి ఇష్టపడలేదా? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ కి నాగార్జున ఖచ్చితంగా వుండాల్సిందేనని దిల్ రాజుని కోరారు. దానికి ఎవరిని అడక్కుండానే దిల్ రాజు మాట ఇచ్చేశాడు. కానీ ఆ మాట నెరవేర్చలేకపోయారు. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమా ఫలితం తెలియడం వల్లే నాగ్ రాలేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారట. మరి ఈ వార్తలపై నిర్మాత దిల్ రాజు ఎలా స్పందిస్తారో అని ఇన్ సైడ్ టాక్.