Begin typing your search above and press return to search.

పద్మాలక్ష్మిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

By:  Tupaki Desk   |   20 April 2016 2:31 PM IST
పద్మాలక్ష్మిలో ఈ యాంగిల్ కూడా ఉందా?
X
మోడల్ కమ్ సెలబ్రిటీ టీవీ హోస్ట్ పద్మాలక్ష్మి సుపరిచితురాలే. నాజూకు అందాలతో ఉండే ఈ అమ్ముడు ఇప్పుడైతే ఆంటీ అయిపోయారే కానీ వయసులో ఉన్నప్పుడు మగాళ్లకు తన అందంతో.. మాటలతో నిద్ర లేకుండా చేశారు. వివాదాస్పద రచయిత సల్మాన్ రష్ధీని పెళ్లాడి.. ఆ తర్వాత విడాకులు తీసుకున్న ఈ భారత సంతతి సెలబ్రిటీ తాజాగా పెద్ద బాంబే పేల్చింది.

ఇప్పటివరకూ తనకు సంబంధించి గ్లామర్ కోణమే ప్రపంచానికి తెలుసన్న ఆమె. తనలోని మరో యాంగిల్ ని చూపించి షాకిచ్చింది. ఇంతకూ ఈ అమ్మడు చెప్పిన మాటలువింటే మైండ్ పోవాల్సిందే. ఎందుకంటే.. ఒకే సమయంలో తాను ఇద్దరు మగాళ్లతో డేటింగ్ చేసినట్లుగా వెల్లడించింది. తాజాగా ఆమె రాసిన ఒక పుస్తకంలో తన వ్యక్తిగత విషయాల్ని ఓపెన్ గానే బయటపెట్టిన ఆమె.. ఇద్దరు మగాళ్లతో ఏకకాలంలో డేటింగ్ చేయటం తప్పు కాదని చెప్పేసింది. ఇందుకు తాను ఎవరికీ సారీ చెప్పాల్సిన అవసరం లేదన్న ఆమె.. అలా చేసినందుకు తాను బాధ పడటం లేదంది.

సల్మాన్ రష్దీతో విడాకులు తీసుకున్న తర్వాత కూతురుతో కలిసి ఉంటున్న ఆమె.. సల్మాన్ తో ఎందుకు విడిపోయానన్నది తెలియటం లేదన్న ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ‘రియల్ పద్మాలక్ష్మి’ గురించి సల్మాన్ కు బాగా తెలిసిందేమో..?