Begin typing your search above and press return to search.
సెక్స్ గురించి కరణ్ జోహార్ షాకింగ్ స్టేట్మెంట్
By: Tupaki Desk | 30 Jun 2016 7:15 AM GMTబాలీవుడ్లో దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఓ వెరైటీ మనిషి. తనను అందరూ గే అనుకుంటారని.. రోజూ పొద్దున ‘హాయ్ గే.. గుడ్ మార్నింగ్’ అంటూ తన మొబైల్ కు మెసేజ్ లు వస్తుంటాయని.. తనలో కొంచెం ఆడంగి లక్షణాలున్న మాట వాస్తవమే అని ఓపెన్ గా మాట్లాడ్డం కరణ్ కే చెల్లింది. తాజాగా తన సెక్సువల్ లైఫ్ గురించి ఓ ప్రముఖ వెబ్ సైట్లో కరణ్ చాలా బోల్డ్ గా ఓ వ్యాసం రాశాడు. తనకు తొలి సెక్స్ అనుభవం ఎప్పుడు జరిగింది.. తనకు ప్రస్తుతం సెక్స్ కోరికలు ఎలా ఉన్నదీ.. వివరిస్తూ కరణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. కరణ్ మరీ ఇంత ఓపెనా అని ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి.
తనకు చిన్న తనంలో సెక్స్ గురించి ఎవరూ పెద్దగా అవగాహన కల్పించకపోవడం వల్ల ఈ విషయంలో చాలా మొహమాటస్థుడిగా తయారయ్యానని.. అందుకే టీనేజీలో కూడా ఎవరితో సెక్స్ లో పాల్గొనలేదని వెల్లడించాడు కరణ్. ‘కుచ్ కుచ్ హోతా హై’ సినిమాతో హిట్టు కొట్టాక కొంచెం బిడియం తగ్గిందని.. 26 ఏళ్ల వయసులో తనకు తొలి సెక్స్ అనుభవం జరిగిందని కరణ్ తెలిపాడు. తర్వాత తర్వాత తనలో బిడియం పోయి సెక్స్ కు అలవాటు పడ్డానని చెప్పాడు. తాను చేయాల్సినంత సెక్స్ చేయలేదని అన్న కరణ్.. ప్రస్తుతం తనకు సెక్స్ పట్ల పెద్దగా ఆసక్తి లేదని అతను వ్యాఖ్యానించాడు. తనకు తానుగా ప్రస్తుతం సెక్స్ కోసం ఎవరి వెంటా పడే పరిస్థితి లేదని.. ఎవరైనా తన వెంట పడితే మాత్రం సెక్స్ చేయడానికి ప్రయత్నిస్తానని కరణ్ తెలిపాడు. ప్రస్తుతం మన సొసైటీ ఎంత అడ్వాన్స్ అయినప్పటికీ సెక్స్ విషయంలో ఓపెన్ డిస్కషన్స్ తక్కువే. ఈ విషయంలో లోపల ఏదేదో పెట్టుకుని.. పైకి మాత్రం గంభీరంగా మాట్లాడుతుంటారు జనాలు. ఇలా ఓపెన్ గా తన సెక్సువల్ లైఫ్ గురించి చెప్పిన కరణ్ జోహార్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.