Begin typing your search above and press return to search.
కోట్లకొద్దీ ఆస్తి ఉన్న భామలు.. పైసా కూడా విదిలించరు!!
By: Tupaki Desk | 2 April 2020 6:39 AM GMTకోవిడ్ - 19 కారణంగా ప్రపంచం మొత్తం అస్తవ్యస్తంగా మారింది.. భారతీయులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. చాలా రోజులనుంచి లాక్ డౌన్ అమలులో ఉంది. ఈ లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. దీంతో పలు కార్పొరేట్ సంస్థలు.. సెలబ్రిటీలు పలు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ లకు విరాళాలు అందిస్తున్నారు. మరికొందరు ఫిలిం సెలబ్రిటీలు సినీరంగానికి తమ వంతు సహాయం అందించేందుకు సి సి సి ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. స్టార్ హీరోల దగ్గర నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల వరకు.. టెక్నీషియన్లు.. ఇతరులు కూడా తమ వంతు సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. అయితే ఈ సమయంలో ఒకరిద్దరు హీరోయిన్ లు తప్ప మిగతా హీరోయిన్లు తమకేమీ పట్టనట్టు ఊరుకోవడం విమర్శలకు దారితీస్తోంది.
టాలీవుడ్ హీరోయిన్ల విషయమే తీసుకుంటే టాప్ హీరోయిన్లుగా చలామణి అవుతున్న రష్మిక మందన్న.. పూజా హెగ్డే.. కీర్తి సురేష్ లాంటి వారు ఇంతవరకూ ఎటువంటి విరాళం ప్రకటించకపోవడంతో నెటిజన్లు వారిని ఓపెన్ గానే విమర్శిస్తున్నారు. రష్మిక కు దాదాపుగా 500 కోట్ల రూపాయల ఆస్తి ఉందని సమాచారం. హీరోయిన్ లలో ఆ స్థాయి ఆస్తి అతి తక్కువ మందికి ఉంటుంది. ఇక రష్మిక ఒక్కో సినిమాకు దాదాపు కోటి రూపాయలు పారితోషికంగా పుచ్చుకుంటుంది. ఈ స్థాయి ఉన్న రష్మిక ఇప్పటివరకూ ఒక్క పైసా కూడా విరాళం ఇవ్వకపోవడం పై నెటిజన్లు విమర్శలు ఎక్కు పెడుతున్నారు. ఇక పూజ హెగ్డే కూడా మంచి బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిందని.. తనకు డబ్బుకు లోటు లేదని అంటున్నారు. పూజ రెమ్యూనరేషన్ రష్మిక కంటే ఎక్కువ. అయినా ఇంతవరకూ ఒక్క పైసా కూడా విరాళం ప్రకటించలేదు.
ఇక మహానటి సావిత్రి పాత్ర పోషించిన కీర్తి సురేష్ కూడా స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన హీరోయిన్. కీర్తి కూడా ఇంతవరకూ ఎటువంటి సాయం ప్రకటించలేదు. ఈ హీరోయిన్లందరూ ఇంటర్వ్యూలలో తమకు సావిత్రిగారు ఆదర్శం అంటూ కవరింగ్ లు మాత్రం ఇస్తారు. కానీ వాస్తవం మాత్రం వేరేగా ఉంది. గతంలో. సావిత్రి జనరేషన్ లో కానివ్వండి సౌందర్య జనరేషన్ లో కానివ్వండి.. హీరోయిన్లు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తమ వంతు సాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే వారు.. ఇప్పటి హీరోయిన్లలో ఎక్కువమంది సోషల్ మీడియాలో పోస్టులకు మాత్రమే పరిమితం కావడం.. తమ సామాజిక బాధ్యతను మరవడం దారుణమని నెటిజనులు విమర్శిస్తున్నారు. మరి ఇప్పటికైనా వీరు మేల్కొంటారా.. లేదా ముందుకు వచ్చి తమ వంతు సాయం ప్రకటిస్తారా అనేది వేచి చూడాలి.