Begin typing your search above and press return to search.
స్టార్ డైరెక్టర్ కే హ్యాండిచ్చిన స్టార్ కిడ్
By: Tupaki Desk | 8 Aug 2018 10:49 PM ISTబాలీవుడ్ లో కథానాయికల్ని పరిచయం చేయడంలో స్టార్ ఫిలింమేకర్ కరణ్ జోహార్ కి ఉన్న రికార్డు వేరు. ఇండస్ట్రీకి బెస్ట్ స్టార్ లను అందించిన ఘనత ఆయనకు ఉంది. భట్స్ క్యాంప్ నుంచి ఆలియాభట్ - శ్రీదేవి - బోనీకపూర్ జంట గారాల పట్టీ జాన్వీ - సైఫ్ అలీఖాన్ డాటర్ సారా అలీఖాన్ - అనన్య పాండే - తారా సుతైర వంటి యువకథానాయికల్ని తెరకు పరిచయం చేశారాయన. వీళ్లలో సారా (కేథార్ నాథ్) - అనన్య - తారా నటిస్తున్న `స్టూడెంట్ ఆఫ్ ది ఈర్ 2` రిలీజ్ కి రావాల్సి ఉందింకా. తదుపరి జాన్వీ సోదరి ఖుషీని కరణ్ జోహార్ ఇంట్రడ్యూస్ చేయనున్నారన్న ప్రచారం ఉంది. ఆలియా - జాన్వీల డెబ్యూలు బంపర్ హిట్ అవ్వడంతో అతడు లక్కీ హ్యాండ్ గానూ పేరు తెచ్చుకున్నాడు.
తదుపరి కింగ్ ఖాన్ షారూక్ గారాల పట్టీ సుహానాని కరణ్ వెండితెరకు పరిచయం చేయనున్నారన్న వార్తలు వచ్చాయి. సుహానా విదేశాల నుంచి ఇండియా వచ్చినప్పుడు తప్పనిసరిగా కరణ్ ని కలుస్తుంది. ఆయన వద్ద నటనకు సంబంధించిన టిప్స్ తీసుకుంటూనే ఉంది. అయితే సుహానా కరణ్ దర్శకత్వంలో లేదా నిర్మాణంలో పరిచయం అయ్యే అవకాశం లేదని తాజాగా సమాచారం అందింది.
సుహానా నటనలో శిక్షణ పొంది పెర్ఫెక్ట్ గా లాంచ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. అయితే తనని కరణ్ జోహార్ పరిచయం చేస్తారా? లేదా అన్నది సందేహమేనని బాలీవుడ్ క్రిటిక్ సుభాష్ కె.ఝా అనడం సంచలనమైంది. షారూక్ - గౌరీ మైండ్ లో ఇతర దర్శకుల పేర్లు మెదులుతున్నాయట. ఒకవేళ అదే నిజమైతే సుహానా కోసం వేరే కాంపౌండ్ రచయితలు స్క్రిప్టులు రెడీ చేస్తూ ఉండొచ్చు. స్టార్ కిడ్స్ లాంచింగ్ అంటేనే అంత సులువేం కాదు. మమ్మీ - డాడ్ పర్యవేక్షణ ఉంటుంది. షారూక్ - గౌరీల ఇన్వాల్వ్ మెంట్ లేకుండా సుహానా విషయంలో ఏదీ జరగదు. కాబట్టి సుహానా ఇప్పటికి కరణ్ కి హ్యాండిచ్చినట్టేనన్న టాక్ నడుస్తోంది. ఇది అంత పెద్ద దర్శకుడికి ఓ రకంగా షాక్ అనే చెప్పాలి.