Begin typing your search above and press return to search.

యాక్టర్లే కాదు వీళ్లు డాక్టర్లు కూడా..!

By:  Tupaki Desk   |   20 Nov 2022 6:30 AM GMT
యాక్టర్లే కాదు వీళ్లు డాక్టర్లు కూడా..!
X
గ్లామర్ ప్రపంచం ఎప్పుడు ఎవరికి ఎలాంటి టర్న్ ఇస్తుందో తెలియదు. ఒక్క సినిమాకే స్టార్ క్రేజ్ తెచ్చుకునే భామలు ఉంటారు ఐదారు సినిమాలు తీసినా సరే సరైన గుర్తింపు తెచ్చుకోలేని హీరోయిన్స్ కూడా ఉన్నారు. కేవలం సినిమాలనే నమ్ముకుంటే ఎలా అనుకుని ప్రొఫెషనల్ గా కూడా డిగ్రీ పట్టా పుచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్ అంతా కూడా వారి ఏదో ఒక కోర్స్ పూర్తి చేసి వస్తున్నారు. ఒకవేళ సినీ కెరీర్ ముగిస్తే వెంటనే వారు అనుకున్న డిగ్రీల మీద కెరీర్ కొనసాగించాలని అనుకుంటున్నారు.

ముఖ్యంగా సౌత్ భామలు చాలామంది యాక్టర్లుగానే కాదు డాక్టర్ కోర్స్ కూడా పూర్తి చేశారు. తెలుగులో రాణిస్తున్న హీరోయిన్స్ చాలామంది డాక్టర్ కోర్స్ పూర్తి చేసి ఉన్నారు. వారిలో ముందుగా భానుమతి ఒక్కటే పీస్ అంటూ తెలుగు ఆడియన్స్ ని ఫిదా చేసిన సాయి పల్లవి గురించి చెప్పుకోవాలి.. ఒక పక్క సినిమాలు చేస్తూ మరోపక్క ఎం.బి.బి.ఎస్ పూర్తి చేసింది సాయి పల్లవి. హీరోయిన్ గా ఎప్పుడైతే సరైన అవకాశాలు రావో అప్పుడు వైద్య వృత్తిని ఎంచుకుంటుందట ఈ అమ్మడు.

ఇక ఈ లిస్ట్ లో డాక్టర్ అయ్యి యాక్టర్ గా చేస్తున్న మరో హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్. ఎలాగు తండ్రి డాక్టర్ కాబట్టి కూతురిని కూడా డాక్టర్ చదువు చదివించారు. శివాని ఈమధ్యనే ఎం.బి.బి.ఎస్ పూర్తి చేసింది.

మళయాళ భామ ఐశ్వర్య లక్ష్మి కూడా వైద్య విద్యలో పట్టా పుచ్చుకుంది. ఈమధ్యనే అమ్ము, పొన్నియిన్ సెల్వన్ 1 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఐశ్వర్య లక్ష్మి. కన్నడ భామ శ్రీలీల కూడా ఓ పక్క వరుస సినిమాలు చేస్తూనే అటు ఎం.బి.బి.ఎస్ కూడా చేస్తుందని తెలుస్తుంది. సౌత్ స్టార్ డైరక్టర్ శంకర్ చిన్న కూతురు అదితి కూడా ఎం.బి.బి.ఎస్ పూర్తి చేసింది. కార్తీ హీరోగా వచ్చిన విరుమన్ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించింది. కేవలం హీరోయిన్ గానే కాదు సింగర్ కూడా అదితి అదరగొడుతుంది. మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ కూడా వైద్య విద్యను పూర్తి చేసింది. బాలీవుడ్ లో ఆమె హీరోయిన్ గా చేస్తూ వస్తుంది.

ఈ లిస్ట్ లో సత్యదేవ్ నటించిన ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య సినిమా హీరోయిన్ రూప కొడువయూర్ కూడా ఉన్నారు. ఆంధ్రాలో ఎం.బి.బి.ఎస్ పూర్తి చేసిన ఈమె ప్రస్తుతం బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ నటిస్తున్న మిస్టర్ ప్రెగ్నంట్ సినిమాలో నటిస్తుంది.

ఇప్పటి హీరోయిన్స్ మాత్రమే కాదు ఒకప్పటి హీరోయిన్స్ కూడా డాక్టర్ కోర్స్ పూర్తి చేసి వెండితెర మీద అలరించారు. తమ్ముడు సినిమాలో హీరోయిన్ గా నటించిన అదితి గోవిత్రికర్ కూడా 1997లోనే ఎం.ఎస్ చేసింది. ఆ తర్వాత మోడలింగ్ సినిమాలు చేస్తూ కెరీర్ సాగించింది. ముందు టీవీ సీరియల్స్ లో నటించి ఆ తర్వాత సినిమా ఛాన్సులు అందుకుంది ఆకాంక్ష సింగ్. ఈమె డాక్టర్ కాకపోయినా ఫిజియోథెరపీ చదువుకుంది.

ఇలా కథానాయికలు వారి కెరీర్ ని ముందే సెట్ చేసుకుని సినిమాల్లోకి వచ్చారు. అయితే ఇక్కడ స్టార్డం వస్తే ఓకే లేదంటే మాత్రం వారు చదివిన డాక్టర్ వృత్తినే ఎంచుకునే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా ఇంత అందత్తెలు డాక్టర్స్ అయితే పేషంట్స్ వారిని చూస్తేనే సగం జబ్బు నయం అవుతుందని చెప్పొచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.