Begin typing your search above and press return to search.
సానియా సినిమా వాళ్ళు తీయట్లేదట...
By: Tupaki Desk | 11 Aug 2015 9:34 AM GMTటెన్నిస్ సంచలనం, హైదరాబాదీ సోయగం సానియా మీర్జా ప్రపంచ ర్యాంకింగ్ లో నంబర్ -1 కిరీటాన్ని ఛేజిక్కించుకుంది. ఈ క్రీడాకారిణి జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు. కెరీర్ పరంగా, వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఎన్నెన్నో. సానియా జీవితం ఎంతో ఇంట్రెస్టింగ్. అయితే ఈ అమ్మడి జీవితాన్ని వెండితెరకెక్కించే ఆలోచన ఏదైనా ఉందా? అని బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఫరాఖాన్ ని ప్రశ్నిస్తే..
ఇంతవరకూ అలాంటి ఆలోచనేం లేదు. ఐడియా ఇచ్చారు కాబట్టి ఆలోచిస్తానని సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో సానియా జీవితాన్ని సినిమాగా తెరకెక్కిస్తే తప్పేంటి? అని టాలీవుడ్ విమర్శకుల్లో డిబేట్ మొదలైంది. మన తెలుగమ్మాయి విజయలక్ష్మి అలియాస్ సిల్కుస్మిత జీవితాన్ని వెండితెరకెక్కించి బాలాజీ టెలీ ఫిలింస్ వందల కోట్లు ఆర్జించింది. క్రీడాకారులు మిల్కాసింగ్, మేరీకోమ్ జీవితాల్ని ఆటోబయోగ్రఫీల పేరుతో తెరకెక్కించి వందల కోట్లు దండుకున్నారు. ఇదంతా బాలీవుడ్ వాళ్లకే చేతనవునా? మనకి చేతకాదా?
ఇప్పుడు సానియా జీవితాన్ని తెరకెక్కించే అవకాశం బాలీవుడ్ వాళ్లకే ఎందుకు ఇచ్చేయాలి? ఏం తెలుగు వాళ్లకు చేతకాదా? ఇక్కడ మనకు అంత ట్యాలెంటు ఉన్న దర్శకులు లేరా? ఒక అందమైన కథని అందంగా చిత్రీకరించలేమా? ఇలా క్వశ్చన్ చేస్తున్నారంతా. మన దర్శకరచయితల్లో చలనం వస్తుందేమో చూడాలి.