Begin typing your search above and press return to search.
నోటా మ్యూజిక్: పాటలు నోటయ్యేలా లేవే!!
By: Tupaki Desk | 2 Oct 2018 1:01 PM GMTగీత గోవిందం సినిమా కథా కథనాలు విజయంలో ఎంత కీలక పాత్ర పోషించినా వాటికి సమతూకంగా గోపి చందర్ ఇచ్చిన సంగీతం కూడా సింహ భాగం తీసుకుంది. ముఖ్యంగా విడుదలకు ముందే అర కోటి దాకా వ్యూస్ తెచ్చుకున్న ఇంకేం ఇంకేం కావాలే పాట గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికీ యూత్ కి హాట్ చార్ట్ బస్టర్ గా ఆ పాట నిలిచింది. దాంతో సహజంగానే విజయ్ దేవరకొండ కొత్త సినిమా నోటా పాటల గురించి ఎక్కువ అంచనాలు ఉంటాయి. కానీ నోటా - మాత్రం దానికి భిన్నంగా ఉండటం అభిమానులను నిరాశ పరిచేదే.
సామ్ సిఎస్ సంగీత దర్శకత్వం వహించిన నోటాలో సహజంగానే తమిళ ఫ్లేవర్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇన్స్ ట్రుమెంటేషన్ బాగున్నప్పటికీ ట్యూన్స్ క్యాచీగా లేకపోవడం ఓవరాల్ గా మ్యూజిక్ లవర్స్ ను మెప్పించేలా లేదు. విక్రమ్ వేదాతో కోలీవుడ్ లో పెద్ద పేరు సంపాదించుకున్న సామ్ బలమంతా బీజీఎమ్ లోఉంటుంది. బహుశా నోటాలో కూడా దానికే ప్రాధాన్యం ఇచ్చినట్టు ఉన్నారు.
మొత్తం నోటాలో ఆరు ట్రాక్స్ ఉన్నాయి. అందులో వాయిస్ ఉన్న పాటలు నాలుగే కాగా మిగిలిన రెండు సినిమా థీమ్ ప్రకారం ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్స్. శ్రీమణి రాసిన ఎత్తరా ఎత్తరా బీట్స్ తో సాగే హుషారు గీతమే అయినా హీరో పాత్ర స్వభావాన్ని వర్ణించేలా ఉందని చెప్పేలా షాట్ నెంబర్స్ 1 2 3 అంటూ సాగే సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి కొంత టైం పట్టేంత హోరులో సాంగ్ ఉంది. రెండో పాట రాజ రాజ కుల కాస్త మెలోడీ టచ్ తోనే ఉన్నా ఆరవ వాసనతో అంతగా కనెక్ట్ అయ్యేలా లేదు. ది రైజ్ అఫ్ ఏ లీడర్ థీమ్ మ్యూజిక్ కాన్సెప్ట్ హీరో రాజకీయాల్లోకి వచ్చినప్పటిదని అర్థమవుతుంది. ఇది కాస్త బెటర్ గానే ఉంది. పవర్ ప్లే అనే మరో థీమ్ మ్యూజిక్ మరీ స్లోగా ఫార్వర్డ్ కు అవకాశం ఇచ్చేలా అనిపిస్తుంది. కుట్రల వెనుక నేపధ్యాన్ని విన్పించే సంగీతం కాబోలు.
రాజేష్ ఏ మూర్తి రాసిన హే మినిస్టర్ హోరెత్తిపోయే బీట్స్ తో ఉంది కానీ ట్యూన్ కొంత క్యాచీగా ఉన్నా రిపీట్ మోడ్ కు అవకాశం ఇవ్వదు. కానీ మరి నిమిషానికే పరిమితం కావడం మరో మైనస్ . చివరి పాట ఎవరిదీ పాపం ఎమోషనల్ గా సాగే క్లైమాక్స్ పాట కావొచ్చు. దీనికి లిరిక్స్ కూడా రాజేష్ ఏ మూర్తినే. ఇది కూడా చాలా తక్కువ నిడివితో ఉంది. మొత్తానికి గీత గోవిందం అంచనాలతో పోల్చుకుంటే దాని దరిదాపుల్లోకి వెళ్లలేని వీక్ మ్యూజిక్ తో నోటా ఎంతవరకు రీచ్ అవుతుంది అన్నది అనుమానమే. పైగా కేవలం రెండు పాటలు మాత్రమే ఫుల్ లెంగ్త్ తో ఉండటం ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. మరి కంటెంట్ మీద భారం వేసిన నోటా ఫలితం మరో మూడు రోజుల్లో తేలిపోనుంది.