Begin typing your search above and press return to search.

బన్నీ వద్దంటే.. విజయ్ ఓకే చేశాడా?

By:  Tupaki Desk   |   28 Sep 2018 10:43 AM GMT
బన్నీ వద్దంటే.. విజయ్ ఓకే చేశాడా?
X
ఒక హీరో వద్దన్న కథను ఇంకో హీరో ఓకే చేసి సినిమా చేయడం కొత్తేమీ కాదు. ఇలాంటి ఉదాహరణలు బోలెడు కనిపిస్తాయి. ‘నోటా’ కూడా ఈ కోవలోనిదే అని కోలీవుడ్ మీడియా అంటోంది. ముందు ఈ కథను దర్శకుడు ఆనంద్ శంకర్.. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు వినిపించాడట. ఐతే కథ బాగున్నప్పటికీ తనకు ఈ సినిమా సెట్టవ్వదని బన్నీ తిరస్కరించాడట. బన్నీ చాలా కాలంగా ద్విభాషా చిత్రం చేయాలని చూస్తున్న నేపథ్యంలో ఆనంద్ ఈ కథను అతడికి చెప్పాడట. ఈ కథను రెండు భాషల్లోనూ చేస్తే బాగుంటుందన్నది అతడి ఆలోచనట. బన్నీ నో చెప్పాక ‘అర్జున్ రెడ్డి’ చూసిన ఆనంద్.. విజయ్ దేవరకొండే తన హీరో అని ఫిక్సయిపోయాడట.

‘నోటా’ కథను ముందు బన్నీకే చెప్పానా లేదా అనే విషయంపై మాట్లాడ లేదు కానీ.. విజయ్ ను ఈ సినిమాకు ఎలా ఒప్పించింది మాత్రం ఈ చిత్ర ప్రెస్ మీట్లో ఆనంద్ వెల్లడించాడు. ‘అర్జున్ రెడ్డి’ చూశాక విజయే ఈ సినిమాకు హీరో అని ఫిక్సయినట్లు అతను చెప్పాడు. తర్వాత వెళ్లి విజయ్ కి కథ చెబితే.. తాను అప్పటికే చాలా కథలు విన్నానని.. తమిళంలో సినిమానా అంటూ సందేహం వ్యక్తం చేశాడని.. ఐతే తాను చెప్పిన లైన్ విన్న గంట తర్వాత ఫోన్ చేసి అద్భుతంగా ఉందని.. పూర్తి కథ చెప్పమని అడిగాడని ఆనంద్ వెల్లడించాడు. ఇందులో హీరో పాత్రకు విజయ్ పూర్తి న్యాయం చేశాడని.. సినిమా చూశాక విజయ్ కి ఇలాంటి పాత్ర ఇచ్చారేంటని ఏ ఒక్క ప్రేక్షకుడూ అనుకోడని.. అతడి అభిమానుల్ని ఈ పాత్ర బాగా ఆకట్టుకుంటుందని ఆనంద్ ధీమా వ్యక్తం చేశాడు. జ్ఞానవేల్ రాజా నిర్మించిన ‘నోటా’ అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ సరసన మెహ్రీన్ కథానాయికగా నటించగా.. సత్యరాజ్.. నాజర్ కీలక పాత్రలు పోషించారు.