Begin typing your search above and press return to search.

దేవరకొండ దర్శకుడు ఫుల్‌ రొమాంటిక్‌ మూడ్‌

By:  Tupaki Desk   |   5 Nov 2018 4:03 PM GMT
దేవరకొండ దర్శకుడు ఫుల్‌ రొమాంటిక్‌ మూడ్‌
X
విజయ్‌ దేవరకొండతో ‘నోటా’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఆనంద్‌ శంకర్‌. తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన ఈ దర్శకుడు నోటా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. నోటాతో పెద్దగా ఆకట్టుకోలేక పోయిన ఆనంద్‌ శంకర్‌ లో మ్యాటర్‌ ఉందని మాత్రం అనిపించుకున్నాడు. తెలుగులో ఈయనతో సినిమాలు చేసేందుకు హీరోలు - నిర్మించేందుకు నిర్మాతలు ఆసక్తిని కనబర్చుతున్నారు. ప్రస్తుతం ఈ దర్శకుడు దీపావళిని ఫుల్‌ గా లవ్‌ అండ్‌ రొమాంటిక్‌ మూడ్‌ తో ఎంజాయ్‌ చేస్తున్నాడు.

తాజాగా ఆనంద్‌ శంకర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఫొటోలు తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. ట్విట్టర్‌ లో ఆనంద్‌ శంకర్‌.. సహజంగా నా పర్సనల్‌ లైఫ్‌ గురించి పబ్లిక్‌ లో మాట్లాడేందుకు ఆసక్తి చూపను. కాని మొదటి సారి నా ప్రేయసితో దీపావళిని దుబాయిలో జరుపుకుంటున్నాను అని చెప్పేందుకు సంతోషిస్తున్నాను అంటూ పోస్ట్‌ చేశాడు.

నా ప్రేమకు మీ ఆశీర్వాదం కావాలంటే ప్రేయసితో ఉన్న పలు ఫొటోలను ఆనంద్‌ శంకర్‌ పోస్ట్‌ చేశాడు. ఆమెతో చాలా క్లోజ్‌ గా ఉన్నవి - ఏకంగా ముద్దులు పెడుతున్నవి కూడా ఆనంద్‌ శంకర్‌ పోస్ట్‌ చేశాడు. ఎప్పుడు కూడా సినిమాల గురించే పోస్ట్‌ చేసే ఆనంద్‌ శంకర్‌ మొదటి సారి తన ప్రైవేట్‌ ఫొటోలను పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం తమిళ సినీ వర్గాల్లో కూడా చర్చనీయాంశం అయ్యింది. ఆమె ఎవరు - ఎలా ఆనంద్‌ శంకర్‌ కు ఆమె పరిచయం అనే విషయాలను తెలుసుకునేందుకు తమిళ మీడియా తెగ ఆరాట పడుతోంది. దుబాయిలో చాలా విలాసవంతమైన హాలీడే ట్రిప్‌ ను ఆనంద్‌ శంకర్‌ ఎంజాయ్‌ చేస్తున్నట్లుగా ఆయన పోస్ట్‌ చేసిన ఫొటోలను చూస్తుంటే అర్థం అవుతుంది.