Begin typing your search above and press return to search.

స్కైలో నోటా నైజాం రైట్స్‌?

By:  Tupaki Desk   |   23 Sep 2018 8:16 AM GMT
స్కైలో నోటా నైజాం రైట్స్‌?
X
'గీత గోవిందం' చిత్రంతో వంద కోట్ల క్ల‌బ్ హీరోగా ఎదిగాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అన్ ఎక్స్‌ పెక్టెడ్ విక్ట‌రీ ఇది. న‌టించిన నాలుగో సినిమాకే 100 కోట్ల క్ల‌బ్ అన్న‌ది దేవ‌ర‌కొండ సైతం ఊహించ‌నిది. ఆ రేంజు కంటెంట్‌ ని ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్‌ పుల్ చేశాడు కాబ‌ట్టే ఇది సాధ్య‌మైంది. అస‌లు ఈ సినిమా అంత చేస్తుంద‌ని గీతా ఆర్ట్స్ మిరాకిల్ మైండ్స్‌ కే తోచ‌లేదంటే అతిశ‌యోక్తి కాదు. బిజినెస్‌ లో త‌ల‌లు పండిన బాస్‌ అల్లు అర‌వింద్‌నే ఊహించ‌లేదు. అయితే ఇప్పుడు దేవ‌ర‌కొండ న‌టిస్తున్న ప్ర‌తి సినిమాకి `గీత గోవిందం` క‌లెక్ష‌న్స్ బెంచ్ మార్క్‌ గా క‌నిపిస్తున్నాయి. ట్రేడ్‌కి ఇదో కొత్త త‌ల‌నొప్పిగా మారింద‌ని విమ‌ర్శ‌లొస్తున్నాయి.

ప్ర‌స్తుతం దేవ‌ర‌కొండ న‌టించిన `నోటా` రిలీజ్ బ‌రిలో ఉన్న సంగ‌తి తెలిసిందే. అక్టోబ‌ర్ 5న‌ రిలీజ్ అంటూ స్టూడియోగ్రీన్ సంస్థ అధికారికంగా తేదీని ప్ర‌క‌టించింది. దేవ‌ర‌కొండ .. వివాదాల ఆర్జీవీని ఇమ్మిటేట్ చేస్తూ నోటా ప్ర‌చారాన్ని ఊద‌ర‌గొట్టేస్తున్నాడు. ఈ ఉత్సాహంలోనే నైజాం రైట్స్‌కి నిర్మాత జ్ఞాన‌వేల్ రాజా ఏకంగా 16 కోట్లు డిమాండ్ చేస్తున్నార‌ట‌. అంత మొత్తం ఎందుకు? అని కొనుక్కునే వాళ్లు ప్ర‌శ్నిస్తే .. `గీత గోవిందం` నైజాంలో 20 కోట్లు వ‌సూలు చేసింద‌ని లెక్క చెబుతున్నాడ‌ట‌. దీంతో పంపిణీదారుల్లో నోటా మాటెత్తితేనే నోటి మాట పెక‌ల‌డం లేదని మాట్లాడుకుంటున్నారు.

`నోటా` కంటెంట్ `గీత గోవిందం` కంటెంట్‌ తో పోటీప‌డుతోందా? ఈ రెండు సినిమాల్ని ఒకే గాటాన క‌ట్టేసి చూడ‌గ‌ల‌మా? ప‌్ర‌స్తుతం ట్రేడ్‌ లో సాగుతున్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ ఇది. నోటా ట్రైల‌ర్ ఆక‌ట్టుకున్నా.. గీత గోవిందం త‌రహాలో బ్లాక్‌ బ‌స్ట‌ర్ ఆడియో ఆల్బ‌మ్ అయినా లేదు. ఇంకా చెప్పాలంటే నోటాకి స‌రైన ప్ర‌చారమే లేదు. అయినా ఒకే ఒక్క బ్లాక్‌ బ‌స్ట‌ర్‌ తో వ‌చ్చిన హైప్‌ ని స్టూడియోగ్రీన్ సంస్థ అధినేత ఎన్‌ క్యాష్ చేసుకోవాల‌నుకోవ‌డం క‌రెక్ట్ కాద‌ని మార్కెట్ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్ర‌స్తుతం దీనిపై ఫిలింస‌ర్కిల్స్‌ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. దేవ‌ర‌కొండ 100 కోట్ల క్ల‌బ్‌ లో చేరినా అప్పుడే నైజాం మెగాస్టార్ అనేయ‌డం కుదురుతుందా? అది క‌రెక్టేనా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.