Begin typing your search above and press return to search.
నోటా 'విడుదల' పై హైకోర్టులో పిటిషన్!
By: Tupaki Desk | 3 Oct 2018 5:08 PM GMTవిజయ్ దేవరకొండ నటించిన `నోటా` చిత్రంపై కొద్ది రోజులుగా వివాదం ఏర్పడిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని ఓ పార్టీకి అనుకూలంగా ఆ సినిమా ఉందని కొందరు ఆరోపించినట్టు పుకార్లు వచ్చాయి. నోటా సినిమా నిలిపివేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి - టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. ముందస్తు ఎన్నికలను `నోటా` సినిమా ప్రభావితం చేసే అవకాశం ఉందని వారు అన్నారు. యువత నోటా ఆప్షన్ ఎంచుకునేలా ఆ సినిమా ట్రైలర్ ఉందని వారు ఆరోపించారు. అయితే, అన్ని విషయాలు పరిశీలించిన మీదటే ఈ సినిమా సెన్సార్ చేసి సర్టిఫికెట్ ఇచ్చామని సెన్సార్ బోర్డు క్లారిటీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటూ సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్‌రెడ్డి ఈసీని కలిశారు. ఈ నేపథ్యంలో తాజాగా, ‘నోటా’ విడుదలను ఆపాలని హైకోర్టులో పిల్ దాఖలైంది.
నోటా అనే పదాన్ని ఓ చిత్రానికి టైటిల్‌గా పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓయూ జేఏసీ నేత కైలాస్ బుధవారం నాడు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఆ సినిమా టైటిల్ గా `నోటా` ను వాడేందుకు ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరని పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉందని, అందువల్ల `నోటా`చిత్రాన్ని, ఎన్నికల సంఘం వీక్షించిన తర్వాతే విడుదల చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఆ సినిమాను ఈసీ చూసిన తర్వాత ఏవైనా అభ్యంతర సన్నివేశాలు ఉంటే తొలిగించిన తర్వాతే విడుదలకు అనుమతినివ్వాలని కోరారు. రాజకీయ నేపథ్యం ఉన్న ఈ సినిమా వల్ల ఓటర్లు ఎక్కువగా ప్రభావితం అయ్యే అవకాశం ఉందని తెలిపారు. గురువారం నాడు ఈ పిటిషన్ విచారణకు రానుంది. ఆల్రెడీ సెన్సార్ బోర్డు `నోటా`విడుదలకు అనుమతినిచ్చిన నేపథ్యంలో రేపు హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది.