Begin typing your search above and press return to search.
నోటా: షాట్ నెంబర్స్ లెక్కేస్తున్న విజయ్!
By: Tupaki Desk | 23 Sep 2018 5:22 PM GMTఇప్పుడు అందరి దృష్టి విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'నోటా' పైనే ఉంది. ఇప్పటికే టీజర్.. ట్రైలర్ లతో అంచనాలు పెంచిన 'నోటా' టీమ్ తాజాగా 'షాట్ నెంబర్' అనే సాంగ్ టీజర్ ను రిలీజ్ చేసింది. ఈ పాటను సెప్టెంబర్ 26 ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తామని టీజర్ లో ప్రకటించారు.
షాట్ నెంబర్ షాట్ నెంబర్ వన్.. షాట్ నెంబర్ షాట్ నెంబర్ టూ.. అంటూ సాగే ఈ పాటలో విజయ్ స్విమ్మింగ్ పూల్ లో అమ్మాయిలతో రచ్చగా డ్యాన్సు చేస్తూ షాట్ నెంబర్ వన్.. టూ.. త్రీ.. ఫోర్.. అంటూ షాట్స్ ఒకదాని తర్వాత ఒకటి లేపుతుంటాడు. ఇక అమ్మాయిలే కాదు.. విజయ్ కూడా కట్ బనియన్.. షార్ట్ వేసుకున్న అవతారంలో ఇహం పరం సుఖం దుఖం అన్నీ మర్చిపోయి బేఫికర్ గా స్టెప్పులేస్తున్నాడు. ఇదొక సీరియస్ మందుపార్టీ సాంగ్.
సాంగ్ టీజర్ మాత్రమే కాబట్టి ఫుల్ ఊపులో ఉన్నట్టు అనిపించింది. పూర్తి పాటకనుక రిలీజ్ అయితే లిరిక్స్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది. కిక్కిచ్చేలా ఉంటే ఇక అన్నీ పార్టీల్లోనూ షాట్ నెంబర్ షాట్ నెంబర్ వన్.. షాట్ నెంబర్ షాట్ నెంబర్ టూ ఒక యాంథెమ్ లా మారినా మీరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. జనాలు సరిగ్గా పాలు తాగుతున్నారో లేదో వాళ్ళకి క్యాల్షియం అందుతుందో లేదో తెలీదు గానీ మందు మాత్రం చక్కగా పట్టిస్తున్నారు. మరి ఇలాంటి పాటలతో ఇంకా వాళ్ళను ఎంకరేజ్ చేస్తేనే కదా ప్రభుత్వ ఖజానాకు ఎక్కువ డబ్బు వచ్చేది..!