Begin typing your search above and press return to search.

దేవరకొండ స్టామినాకు లిట్మస్ టెస్ట్

By:  Tupaki Desk   |   5 Oct 2018 6:27 AM GMT
దేవరకొండ స్టామినాకు లిట్మస్ టెస్ట్
X
ఒక హీరో సత్తాను లెక్క వేయడానికి ముఖ్యమైన కొలమానం బాక్స్ ఆఫీసు వసూళ్ళే. వాటిని బట్టే హీరో కు 20 కోట్ల మార్కెట్టా.. 40 కోట్ల మార్కెట్టా లేదా 100 కోట్ల మార్కెట్టా అనేది డిసైడ్ అవుతుంది. ఇప్పటివరకూ ఆ లెక్క తేలని స్టార్ హీరో విజయ్ దేవరకొండ మాత్రమే. చేసిందే అరడజను సినిమాలు కావడం.. పైగా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది లాస్ట్ సినిమా 'గీత గోవిందం' ఒక్కటే కావడంతో విజయ్ దేవరకొండ మార్కెట్ రేంజ్ ఎంత అనే విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు.

విజయ్ తాజా చిత్రం 'నోటా' ఈరోజే రిలీజ్ అయింది. ఈ సినిమాతో విజయ్ సత్తాపై ఒక అవగాహనకు రావొచ్చని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం. 'గీత గోవిందం' ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి 70 కోట్ల రేంజ్ టచ్ చేసింది. కానీ 'నోటా' ఒక సీరియస్ పొలిటికల్ థ్రిల్లర్. ఈ సినిమాకు 'గీత గోవిందం' రేంజ్ కలెక్షన్స్ ఆశించడం కరెక్ట్ కాదు. ఈ సినిమాకు 'అర్జున్ రెడ్డి' రేంజ్ లో కలెక్షన్స్ రావడమే కాస్త కష్టమైన విషయం.. ఎందుకంటే.. యూత్ ను అప్పీల్ చేసే ఎలిమెంట్స్ అయిన రొమాన్స్.. కామెడీ.. ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో ఆశించలేం. ఇక టాక్ బాగుంటే సరే గానీ టాక్ అటూ ఇటూ ఐతే మాత్రం 'నోటా' సినిమా విజయ్ స్టార్ పవర్ మీదే బాక్స్ ఆఫీస్ దగ్గర నెట్టుకురావలిసి ఉంటుంది.

సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఓపెనింగ్ డే కలెక్షన్స్ మాత్రం విజయ్ దేవరకొండ రేంజ్ ను సూచిస్తాయి. ఇప్పటివరకైతే బుకింగ్స్ జోరుగా ఉన్నాయి. భారీ స్థాయిలో రిలీజ్ చేస్తుండడంతో భారీ ఓపెనింగ్స్ నమోదయ్యే అవకాశం ఉంది. రేపటికి ఈ విషయపై మనకు పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది.