Begin typing your search above and press return to search.
అగ్ర దర్శకుడికి ఏదీ కలిసిరావడం లేదు..!
By: Tupaki Desk | 20 May 2021 9:57 AM GMTదక్షిణాది అగ్ర దర్శకుడు శంకర్ కు ఇప్పుడు ఏదీ కలిసిరావడంలేదు. 2010 లో వచ్చిన 'రోబో' సినిమా తర్వాత ఆ స్థాయి సక్సెస్ అందుకోలేకపోతున్న శంకర్ కు, ఈ మధ్య అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. విశ్వనటుడు కమల్ హాసన్ తో మొదలుపెట్టిన 'ఇండియన్ 2' సినిమా అర్థాంతరంగా ఆగిపోయింది. లైకా ప్రొడక్షన్ హౌస్ తో ఉన్న విభేదాల కారణంగా ఈ మూవీ తిరిగి సెట్స్ పైకి వెళ్లలేదు. దాన్ని పక్కనపెట్టిన శంకర్.. ఇటు తెలుగులో అటు హిందీలో స్టార్ హీరోలతో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఓ పాన్ ఇండియా మూవీని ప్రకటించారు శంకర్. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మించనున్నారు. ఇదే క్రమంలో బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ తో 'అన్నియన్' (అపరిచితుడు) రీమేక్ ని తెరకెక్కించనున్నట్టు శంకర్ వెల్లడించారు. పెన్ స్టూడియోస్ బ్యానర్ పై జయంతి లాల్ గడ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలో ‘ఇండియన్ 2’ చిత్ర నిర్మాణ సంస్థ లైకా, మద్రాస్ కోర్టులో శంకర్ పై కేసు వేసింది. తమ సినిమా పూర్తయ్యే వరకు వేరే సినిమాలకు దర్శకత్వం వహించకుండా శంకర్ ను ఆదేశించాలని కోర్టును కోరింది.
ఇదే క్రమంలో 'ఇండియన్ 2' చిత్రాన్ని పూర్తి చేసే వరకు మరో సినిమాకు పనిచేయకుండా చూడాలంటూ లైకా సంస్థ.. తెలుగు, హిందీ ఫిల్మ్ చాంబర్లకు లెటర్లు రాసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో '#RC15' మరియు 'అపరిచితుడు' రీమేక్ సినిమాలపై క్లారిటీ కోసం హీరో నిర్మాతలు దర్శకుడు శంకర్ ని సంప్రదించాలని అనుకుంటున్నారట. ఇప్పుడు దిల్ రాజుతో చరణ్ ఈ విషయంపై చర్చించారట. అలానే రణ వీర్ సింగ్ కూడా నిర్మాతలతో కలసి శంకర్ తో రీమేక్ సినిమాపై క్లారిటీ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. ఇప్పుడు ఇదే విషయంపై ఇటు టాలీవుడ్ అటు బీ టౌన్ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది.