Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ కి ED నోటీసులు.. షాక్ లో ఇండస్ట్రీ!
By: Tupaki Desk | 15 May 2022 4:30 AM GMTకరోనా క్రైసిస్ కి ముందు పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ సంచలనమైన సంగతి తెలిసిందే. అప్పట్లో పలువురు బంగారం వ్యాపారులు హవాలా కేసుల్లో బుక్కయ్యారు. పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ కేసులు నమోదయ్యాయి. ఇకపోతే ఇప్పుడు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నుంచి నోటీసులు అందడం మలయాళ ఇండస్ట్రీని షాక్ కి గురి చేసింది. పురాతన వస్తువుల డీలర్లతో మోహన్ లాల్ కు ఉన్న సంబంధమే దీనికి కారణం. ఈ సంబంధం వెనక ఏం జరుగుతోంది? అన్న ఆరాలతో మోహన్ లాల్ పై ED దృష్టి సారించిందని తెలిసింది.
కేరళకు చెందిన మాన్సన్ మాన్ కల్ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా పురాతన ఆర్ట్ డీలర్ గా నటిస్తూ పలువురి నుంచి రూ.10 కోట్లకు పైగా మోసం చేశాడు. అతను టిప్పు సుల్తాన్ సింహాసనం- ఔరంగజేబు ఉంగరం- ఛత్రపతి శివాజీ భగవద్గీత కాపీ మొదలైన కొన్ని వస్తువులను విక్రయించినట్లు కథనాలొచ్చాయి.
ఇటీవల పది కోట్ల మేర చీటింగ్ కేసులో మాన్సన్ మాన్ కల్ ను అరెస్ట్ చేసిన కేరళ పోలీసులు విచారించారు. ఈ విచారణలో అతడికి మోహన్ లాల్ తో సంబంధాలున్నట్లు గుర్తించారు. మోహన్ లాల్ మాన్సన్ ఇంటికి వెళ్లి అతనితో మనీలాండరింగ్ లో పాల్గొన్నట్లు వారు ఆధారాలు కనుగొన్నారు. ఇదే విషయంలో ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మోహన్ లాల్ కు నోటీసులు పంపింది. కొన్ని ప్రశ్నల కోసం వచ్చే వారం ED కార్యాలయాన్ని సందర్శించాలని కోరింది. మోహన్ లాల్ పై ఆరోపణలు ED నోటీసుల గురించి తెలుసుకున్న మలయాళ చిత్ర పరిశ్రమ షాక్ కి గురయ్యింది.
ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇంకా పూర్తి ఆధారాలతో వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ప్రస్తుతానికి లాల్ కి ఈడీ నోటీసుల వార్తతో మలయాళ పరిశ్రమ షాక్ లో ఉంది. ఆయన అభిమానులు కలతకు గురవుతున్నారు. దీనిపై లాల్ కుటుంబం స్పందించాల్సి ఉంటుంది.