Begin typing your search above and press return to search.
పన్ను కట్టండి అంటూ... ఐశ్వర్యకు నోటీసులు
By: Tupaki Desk | 17 Jan 2023 11:30 PM GMTమాజీ ప్రపంచ సుందరి ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్... అభిషేక్ బచ్చన్ వివాహం చేసుకున్న తర్వాత సినిమాల విషయంలో జోరు తగ్గించింది. ఇప్పుడు కూడా అడపా దడపా సినిమాల్లో నటిస్తోంది. కానీ ఒకప్పటిలా వరుస సినిమాలు అయితే చేయడం లేదు. తాజాగా ఆమెకు రెవెన్యూ అధికారులు నోటీసులు పంపడం బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఐశ్వర్యారాయ్‌కి మహారాష్ట్రలోని నాసిక్‌లో ఒక ప్లాట్ ఉంది. అయితే ఆ ప్లాట్‌కి సంబంధించి ఆమె పన్నులు చెల్లించకపోవడంతో నాసిక్ రెవెన్యూ అధికారులు.. ఆమెకి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఏడాది నుంచి ఐశ్వర్యరాయ్ తన భూములకు సంబంధించిన పన్నులు చెల్లించడం లేదని అధికారులు ఆమెకు జారీ చేసిన నోటీసులలో పేర్కొన్నారు. నాసిక్ సిన్నర్‌లోని అవడి అనే ప్రాంతంలో ఐశ్వర్య రాయి పేరు మీద భూమి ఉంది. ఈ భూమికి ఏడాదికి 21వేల 960 రూపాయల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దాదాపు ఆమె పేరు మీద ఒక ఎకరా భూమి ఉందని చెబుతున్నారు.
అయితే ఏడాది నుంచి ఆమె 21వేల 960 రూపాయలు చెల్లించలేదని దీంతో ఆమెకు నోటీసులు జారీ చేశామని... నాసిక్ రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఆమెకు నోటీసులు అందిన 10 రోజులలోపు ఈ పన్నులు గనుక చెల్లించకపోతే మహారాష్ట్ర భూ రెవెన్యూ చట్టం 1966లో సెక్షన్ 1704 ప్రకారం ఐశ్వర్యరాయ్ మీద తగిన చర్యలు తీసుకుంటామని కూడా అధికారుల నోటీసుల్లో పేర్కొన్నారు.
ఒకరకంగా ఐశ్వర్యారాయ్ ఇదివరకట్లా వరుస సినిమాలో చేయకపోయినా తన స్థాయికి తగిన సినిమాలు వస్తే మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఇటీవలే ఆమె మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వం అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఆమె నందిని అనే పాత్రలో నటించింది. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్న పోనీయం సెల్వం రెండో భాగంలో కూడా ఆమె అదే పాత్రలో నటిస్తోంది. ఇక ప్రస్తుతం ఆమె తన కుమార్తె ఆరాధ్య బచ్చన్ ఆలన పాలన చూసుకునేందుకు సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిందని చెబుతున్నా
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.