Begin typing your search above and press return to search.
ఇళయరాజాకు నోటీసులు ఇచ్చిన కేంద్రం
By: Tupaki Desk | 27 April 2022 2:30 AM GMTప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజాకు మరో షాక్ తగిలింది. ఇటీవలే ఐటీ నోటీసులు అందుకున్న ఆయనకు తాజాగా జీఎస్టీ శాఖ నుంచి కూడా నోటీసులు జారీ అయ్యాయి.
2013-2015 మధ్య రూ.1.8 కోట్ల మేర పన్ను కట్టాలంటూ జీఎస్టీ చెన్నై నుంచి మంగళవారం ఇళయరాజాకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ మొత్తానికి వడ్డీ, జరిమానా అధికమని కూడా ఈ నోటీసుల్లో జీఎస్టీ తెలిపింది.
ఇప్పటికే పన్ను చెల్లింపులకు సంబంధించి ఇళయరాజాకు మూడు నోటీసులు జారీ అయ్యాయని తెలిసింది. అయితే ఆ నోటీసులకు ఇళయారాజా నుంచి స్పందన లేకపోవడంతోనే జీఎస్టీ తాజా నోటీసును జారీ చేసింది.
కాగా ఇళయరాజా ఈ నోటీసులపై స్పందించలేదు. ఇటీవల ఇళయరాజా ప్రధాని మోడీని అంబేద్కర్ తో పోల్చి మాట్లాడారు. పన్నుల అంశం నుంచి కాపాడుకోవడానికే ఇళయరాజా ప్రధానిపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ప్రచారం సాగింది. ఈ క్రమంలోనే ఆయనకు కేంద్రంలోని బీజేపీ రాజ్యసభ ఎంపీ పదవి ఇస్తోందని జోరుగా ప్రచారం జరిగింది. ఆయనకు పద్మ అవార్డులు కూడా ఇస్తారని అన్నారు. కానీ తాజాగా కేంద్ర జీఎస్టీ సంస్థ నోటీసులు జారీ చేయడంతో ఈ ప్రచారానికి తెరపడినట్టైంది.