Begin typing your search above and press return to search.

చిన్న సినిమాలకు గుడ్ న్యూస్!

By:  Tupaki Desk   |   20 Aug 2016 5:30 PM GMT
చిన్న సినిమాలకు గుడ్ న్యూస్!
X
చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదనే విమర్శ నిత్యం టాలీవుడ్ లో వినిపిస్తూనే ఉంటుంది. ఇందులో వాస్తవం లేదని కూడా అనలేని పరిస్థితి. దీంతో చిన్న సినిమాల నిర్మాతలు నిత్యం ఈ ఇబ్బందికి గురవుతున్నారు. అయితే తాజాగా తెలిసిన విషయం చిన్న సినిమాలకు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఈ ఏడాది సెప్టెంబరులో యంగ్ టైగర్ "జనతా గ్యారేజ్‌".. అక్టోబరులో మెగా పవర్ స్టార్ "ధృవ" సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు పెద్ద సినిమాల తర్వాత ఈ ఏడాదిలో మరే పెద్ద హీరో సినిమాలేదు.

ఈ లెక్కన 2016లో ఈ రెండు సినిమల అనంతరం అగ్ర కథానాయకుల చిత్రాల విడుదల దాదాపుగా ముసిగిపోయినట్టే. దీంతో ఈ సినిమాలు ఎంత బాగా సూపర్ హిట్ అయినా.. ఈ రోజుల్లో నెలరోజులకు మించి ఆడేఅవకాశాలు లేవుకాబట్టి.. నవంబరు - డిసెంబరు నెలల్లో థియేటర్లలో పెద్ద సినిమాలు ఉండకపోవచ్చు. దీంతో మధ్యస్థాయి బడ్జెట్‌ చిత్రాలు - చిన్న సినిమాలకే టాలీవుడ్‌ పరిమితం కానుంది. ఇది కచ్చితంగా చిన్న సినిమాలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే ఈమధ్యకాలంలో చిన్న సినిమాలు కూడా ఆశ్చర్యపరిచే వసూళ్లు సాధిస్తుండటంతో.. ఈ రెండు నెలల్లో కాస్త కంటెంట్ ఉన్న చిన్న సినిమాలకు పండగే.

మహేష్‌ బాబు - పవన్‌ కల్యాణ్‌ - ప్రభాస్‌ - అల్లు అర్జున్‌ లతో పాటు సీనియర్‌ హీరోలు చిరంజీవి - బాలకృష్ణ - నాగార్జున - వెంకటేష్‌ లు కూడా వచ్చే ఏడాదే కనిపించబోతున్నారు. దీంతో వీళ్లందరినీ తెరపై చూడాలంటే 2017 వరకూ ఆగాల్సిందే. అంటే ఎన్టీఆర్‌ - రామ్‌ చరణ్‌ ల సినిమాలు వచ్చి వెళ్లిపోతే ఇక చిత్రసీమకు చిన్న సినిమాలే ఆధారం అన్నమాట.