Begin typing your search above and press return to search.
నవంబర్ నిరాశ పరిచింది.. ఇక డిసెంబర్ పైనే ఆశలన్నీ..!
By: Tupaki Desk | 1 Dec 2021 5:35 AM GMTకరోనా సెకండ్ వేవ్ పాండమిక్ తర్వాత మళ్ళీ ఇప్పుడిప్పుడే సినీ ఇండస్ట్రీ గాడిలో పడుతోంది. సెప్టెంబరులో వచ్చిన 'లవ్ స్టోరీ' సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఊపిరి పోయగా.. అక్టోబరులో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ఇండస్ట్రీకి కళ తీసుకొచ్చింది. ఈ రెండు నెలల్లో విడుదలైన మరికొన్ని సినిమాలు పర్వాలేదనిపించడంతో.. తెలుగు సినిమాపుంజుకున్నట్లే అనుకున్నారు. అయితే నవంబర్ లో టాలీవుడ్ లు నిరాశే ఎదురైంది.
దీపావళి కానుకగా నవంబర్ ఫస్ట్ వీక్ లో 'పెద్దన్న', 'మంచి రోజులు వచ్చాయి', 'ఎనిమీ' వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఫస్ట్ డే మంచి వసూళ్ళు రాబట్టిన ఈ సినిమాలు.. లాంగ్ రన్ లో నిలబలేకపోయాయి. టాక్ బాగున్నా ఎందుకనో జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలో తర్వాతి వారంలో బరిలో దిగిన 'రాజా విక్రమార్క' ప్రభావం చూపించలేకపోయింది. దీంతో పాటుగా వచ్చిన 'పుష్పక విమానం' సినిమా మంచి టాక్ తెచ్చుకున్నా.. బాక్సాఫీస్ వద్ద మెరుగైన కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.
నవంబర్ 19న ఒకే రోజు దాదాపు పది చిన్నా చితక సినిమాలు విడుదలైనా.. జనాలు ఒక్కదాన్ని కూడా ఆదరించలేదు. అన్నీ ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయాయి. ఇక నవంబరు చివరి వారంలో 'అనుభవించు రాజా' 'క్యాలీఫ్లవర్' 'ది లూప్' వంటి సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. తొలి రోజు కాస్త సందడి చేసిన ఈ సినిమాలు.. తర్వాతి రోజు నుంచి డల్ అయ్యాయి. వీటితోపాటు వచ్చిన ఏ చిన్న సినిమా కూడా నిలవలేదు.
నవంబర్ నెలలో వచ్చే సినిమాలు నిరాశ పరుస్తాయని ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది. గత కొన్నేళ్లుగా విడుదలైన సినిమాలను పరిశీలిస్తే ఇది నిజమేమో అనిపిస్తుంది. ఈసారి కూడా ఈ నెల టాలీవుడ్ కు కలిసిరాలేదని ట్రేడ్ వర్గాలు విశ్లేషించారు. వారానికో నాలుగు సినిమాలు లెక్కన విడుదలైనా.. ఒక్కటంటే ఒక్కటీ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోవడంతో బాక్సాఫీస్ కళ తప్పింది.
ఇప్పుడు ఆశలన్నీ డిసెంబరు నెలలో విడుదలయ్యే సినిమాల మీదే ఉన్నాయి. రేపు (డిసెంబర్ 2) గురువారం 'అఖండ' చిత్రం భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. సెకండ్ వేవ్ పాండమిక్ తర్వాత థియేటర్ లలోకి రాబోతున్న పెద్ద సినిమా ఇదే. ఈ నెలలో 'పుష్ప: ది రైజ్' 'శ్యామ్ సింగ రాయ్' 'గుడ్ లక్ సఖీ' 'లక్ష్య' వంటి సినిమాలు విడుదల కానున్నాయి. వీటితోపాటు 'మరక్కార్' 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' '83' 'మడ్డీ' వంటి చిత్రాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. డిసెంబర్ సినిమాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ కు పునర్వైభవం వస్తుందని అందరూ ఆశిస్తున్నారు.