Begin typing your search above and press return to search.
అందరి టార్గెట్ బాహుబలినే!
By: Tupaki Desk | 29 Oct 2018 7:23 AM GMTఇప్పుడు బాక్స్ ఆఫీస్ కాస్త డల్ గా ఉంది కాని వచ్చే నెల భారీ క్రేజీ సినిమా పోటీ మాత్రం మహా రసవత్తరంగా మారబోతోంది. ఇందులో తెలుగు స్ట్రెయిట్ మూవీస్ కూడా ఉన్నప్పటికీ మూడు డబ్బింగ్ సినిమాలు మన ప్రేక్షకులను సైతం ఆకరిస్తున్నాయి. వేటికవే ఇక్కడ కూడా విపరీతమైన క్రేజ్ ఉన్నవే కావడం విశేషం. ముందుగా వస్తున్నది విజయ్ సర్కార్. మురుగదాస్ దర్శకత్వంలో తుపాకీ-కత్తి తర్వాత హ్యాట్రిక్ కొడుతుందనే అభిమానుల అంచనాల మధ్య వచ్చే నెల 6న భారీ ఎత్తున విడుదల కాబోతోంది.
తెలుగు వెర్షన్ మీద మంచి బిజినెస్ జరిగింది. పాత మెర్సల్ రికార్డులతో పాటు ఇతర రాష్ట్రాల్లో బాహుబలి 2 సెట్ చేసిన రికార్డులను ఇది బీట్ చేస్తుందనే అంచనాలు తమిళ తంబీలు భారీగా పెట్టుకున్నారు. ఇక రెండు రోజుల గ్యాప్ తో అమీర్ ఖాన్ అమితాబ్ బచ్చన్ నటించిన పీరియాడికల్ మూవీ తగ్స్ అఫ్ హిందుస్థాన్ వచ్చేస్తుంది. 250 కోట్లకు పైగా పెట్టుబడితో హిందీలో బాహుబలిని తలదన్నే రీతిలో ఇది ఆడుతుందన్న అంచనాలు గట్టిగానే ఉన్నాయి.
ఇక వీటన్నిటి కంటే గాడ్ ఫాదర్ గా భావిస్తున్న సూపర్ స్టార్ రజని కాంత్ 2.0 నవంబర్ 29న వస్తుంది. భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ఖరీదైన సినిమాగా ప్రచారంలో ఉన్న 2.0 సుమారు వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్ టార్గెట్ తో బరిలోకి దూకుతోంది. బాహుబలిని అన్నిరకాలుగా దాటేస్తేనే ఇది సేఫ్ గా నిలుస్తుంది. శంకర్ మనసులో కూడా అదే ఉన్నట్టు ఆయన ఇంటర్వ్యూలలో ఇన్ డైరెక్ట్ గా బయట పడుతూనే ఉంది. సో 2.0 కనివిని ఎరుగని విడుదలను సొంతం చేసుకోవడమే కాదు అంతకు మించి అనే స్థాయిలో వసూళ్లను రాబట్టాలి. నవంబర్ 5న విడుదల కానున్న ట్రైలర్ తో అంచనాలు ఎక్కడికో వెళ్లిపోవడం ఖాయమని నిర్మాతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి ఈ మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఏది బాహుబలిని దాటుతుందో లేక అసలు ఏది దాటకుండా సేఫ్ గా నిలబెట్టేస్తాయో వచ్చే నెలాఖరుకి తేలిపోతుంది.