Begin typing your search above and press return to search.

ఇప్పుడు 'RRR' వంతు.. బిగ్ ట్రీట్ కి అంతా రెడీ

By:  Tupaki Desk   |   12 March 2022 9:30 AM GMT
ఇప్పుడు RRR వంతు.. బిగ్ ట్రీట్ కి అంతా రెడీ
X
ద‌క్షిణాది చిత్రాల హ‌వా దేశ వ్యాప్తంగా 'బాహుబ‌లి' త‌రువాతే మొద‌లైంది. ఈ మూవీ అందించిన ఉత్సాహంతో దేశ వ్యాప్తంగా సౌత్ సినిమాలు సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నాయి. అదే స‌మ‌యంలో బాలీవుడ్ చిత్రం 'దంగల్‌' కూడా వ‌ర‌ల్డ్ వైడ్ గా స‌రికొత్త చ‌రిత్ర‌ని క్రియేట్ చేసింది. అయితే కోవిడ్ కార‌ణంగా హిందీ చిత్రాలు థియేట‌ర్ల‌లోకి రాక‌పోవ‌డం.. అత్య‌ధికంగా ఓటీటీల‌కే ప‌రిమితం కావ‌డం.. అదే స‌మ‌యంలో టాలీవుడ్ చిత్రాలు థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌డంతో మ‌న చిత్రాల‌కే అత్య‌ధిక ప్రాధాన్యత ల‌భించ‌డం మొద‌లైంది.

అంతే కాకుండా బాలీవుడ్ చిత్రాల్లో అత్య‌ధిక శాతం కంటెంట్ వున్నా ఆక‌ట్టుకునే స్థాయిలో లేక‌పోవ‌డంతో డే వ‌న్ నుంచి ఈ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద పేళ‌వ‌మైన ఫ‌లితాల్ని అందించ‌డం మొద‌లుపెట్టాయి. అంతే కాకుండా ద‌క్షిణాది చిత్రాల త‌ర‌హాలో మాస్ మ‌సాలా క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ అంశాలు బాలీవుడ్ చిత్రాల్లో లేక‌పోవ‌డం కూడా ప్ర‌ధాన లోపంగా మారింది. దీంతో మాస్ మ‌స‌లా అంశాల‌తో తెర‌కెక్కిన 'పుష్ప‌' చిత్రానికి బాలీవుడ్ తో స‌హా ఎంటైర్ నేష‌న్ బ్ర‌హ్మ‌రంథం ప‌ట్టింది.

దీని ప్ర‌భంజ‌నానికి వ‌ర‌ల్డ్ క‌ప్ నేప‌థ్యంలో రూపొందిన '83' ఊసే ఎక్క‌డా క‌నిపించ‌లేదు. దాని హ‌డావిడి కూడా వినిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. బాలీవుడ్ లో ఎన్ని క్రేజీ చిత్రాలు విడుద‌లైనా ఉత్త‌రాది ప్రేక్ష‌కులు మాత్రం 'పుష్ప‌' చిత్రానికే అగ్ర‌తాంబూలం ఇచ్చారు. ఈ మూవీ ఉత్త‌రాదిలో రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డం బాలీవుడ్ వ‌ర్గాలని విస్మ‌యానికి గురిచేసింది. ఉత్త‌రాదిలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసిన చిత్రంగా 'పుష్ప' నిలిచి ట్రేడ్ వ‌ర్గాల‌ని షాక్ కు గురిచేసింది. ఈ మూవీ త‌రువాత స్థానంలో హాలీవుడ్ మూవీ 'స్పైడ‌ర్ మ్యాన్ నో హోమ్‌' నిలిచింది.

హిందీ చిత్రం 'సూర్య‌వన్షీ' మూడ‌వ స్థానాన్ని ద‌క్కించుకుంది. 'పుష్ప‌' కార‌ణంగా బాలీవుడ్ చాలా వ‌ర‌కు వెన‌క‌బ‌డిపోవాల్సి వ‌చ్చింది. ఇటీవ‌ల 'రాధేశ్యామ్‌' విడుద‌లైంది. త్వ‌ర‌లో ఆర్ ఆర్ ఆర్‌, కేజీఎఫ్‌, లైగ‌ర్ బాలీవుడ్ పై దండెత్త‌ కాబోతున్నాయి. ఇది బాలీవు్ వ‌ర్గాల వెన్నులో వ‌ణుకు పుట్టిస్తోంది. అంతే కాకుండా ప్రాంతీయ సినిమా స్టార్స్ బాలీవుడ్ స్టార్స్ ఖాన్ లు, క‌పూర్ లు, సింగ్, కుమార్ ల‌ని మించి పారితోషికాల రూపంలో సౌత్ హీరో ప్ర‌భాస్ రూ. 100 కోట్లు వ‌సూలు చేస్తుండ‌టంతో బాలీవుడ్ వ‌ర్గాల‌కు స‌హించ‌డం లేద‌ట‌. ఆ కార‌ణంగానే 'రాధేశ్యామ్‌'పై బాలీవుడ్ మీడియా ఎలాంటి వార్త‌ల‌ని ప్ర‌చురించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఆ కార‌ణంగానే 'రాధేశ్యామ్‌' చిత్రానికి బాలీవుడ్ మీడియా నెగెటివ్ రివ్యూస్ ని అందించ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తెలుగు సినిమా రివ్యూల‌కు బాలీవుడ్ క్రిటిక్స్ పాజిటివ్ గా స్పందించాలంటే 12 ల‌క్ష‌ల నుంచి 20 ల‌క్ష‌లు డిమాండ్ చేస్తున్నార‌ట‌. అది ఇవ్వ‌క‌పోవ‌డం వ‌ల్లే 'రాధేశ్యామ్‌'పై నెఓగెటివ్ రివ్యూస్ రాసిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లో రాబోతున్న 'ఆర్ ఆర్ ఆర్‌' పై చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ మూవీని కూడా తొక్కేసే ప్ర‌య‌త్నం చేసే అవ‌కాశం వుంద‌ర‌ని అంటున్నారు.

అయితే ఇది రాజ‌మౌళి సినిమా కాబ‌ట్టి అందులోనూ మాస్ ఆడియ‌న్స్ కి ట్రీట్ లా వుంటుంది కాబ‌ట్టి ఈ మూవీ విష‌యంలో వారి ప్పులు వుడికే ఆస్కార‌మేలేద‌న్న‌ది తాజా వాద‌న‌. అంతే కాకుండా ఈ మూవీ విష‌యంలో అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌కుండా పీ ఆర్ టీమ్ ఇప్ప‌టికే సిద్ధ‌మైన‌ట్టుగా చెబుతున్నారు. దీంతో 'ఆర్ ఆర్ ఆర్' దేశ వ్యాప్తంగా స‌రికొత్త రికార్డులు సృష్టిస్తూ మెస్మ‌రైజింగ్ ట్రీట్ ఇవ్వ‌డం ఖాయం అంటున్నారు టాలీవుడ్ జ‌నం.