Begin typing your search above and press return to search.
ఇప్పుడు ప్రశాంత్ నీల్ ముందున్న అతి పెద్ద ఛాలెంజ్ అదే..!
By: Tupaki Desk | 25 May 2022 3:12 AM GMTకన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ 'కేజీయఫ్: చాప్టర్ 2' సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ తో ఈ ఏడాది బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది 'కేజీఎఫ్' ఫ్రాంచైజీ. ఓవరాల్ గా అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడో భారతీయ సినిమాగా రికార్డులకెక్కింది.
'ఉగ్రమ్' చిత్రంతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రశాంత్.. 'కేజీయఫ్ 1' తోనే తన సత్తా ఏంటో బాక్సాఫీస్ కు చూపించాడు. భారతదేశంలో అత్యంత డిమాండ్ ఉన్న ఫిలిం మేకర్స్ లో ఒకరిగా మారిన నీల్.. ఇప్పుడు 'కేజీఎఫ్ 2' మూవీతో మరోసారి అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేశాడు.
ప్రశాంత్ నీల్ ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో 'సలార్' మూవీ చేస్తున్నాడు. ఇది సెట్స్ మీద ఉండగానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. దీని తర్వాత 'KGF: చాప్టర్ 3' ఉండే అవకాశం ఉందని మేకర్స్ ఇటీవల హింట్ ఇచ్చారు.
అంటే ప్రశాంత్ నీల్ నుంచి రానున్న రోజుల్లో మూడు అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాలుగా ఉండబోతున్నాయన్నమాట. ఈ లైనప్ చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నా.. ఇవన్నీ ఒకే మూడ్ లో ఉండటం వారిని కలవరపెడుతోంది.
'కేజీఎఫ్' రెండు భాగాలు డార్క్ మూడ్ లో సెట్ చేయబడ్డాయి. ఎలివేషన్ సీన్స్ మరియు భారీ యాక్షన్ బ్లాక్స్ - ఎమోషనల్ సన్నివేశాలు కలబోసి డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో మెప్పించారు దర్శకుడు ప్రశాంత్. 'సలార్' ఫస్ట్ లుక్ మరియు లీక్ అవుతున్న మేకింగ్ వీడియోలను పరిశీలిస్తే ఇది కూడా 'కేజీఎఫ్' మాదిరిగానే ఉంటుందనే ఫీలింగ్ ని కలిగిస్తోంది.
ఇటీవల తారక్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన NTR31 ప్రీ లుక్ పోస్టర్ కూడా అదే బ్లాక్ థీమ్ తో ఉంది. ఒకే మూడ్ లో ఎలివేషన్ షాట్స్ - హై వోల్టేజ్ యాక్షన్ తో వెంటవెంటనే సినిమాలు చేస్తే ప్రేక్షకులు సరికొత్త అనుభూతికి లోనవుతారా? సేమ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
'ఉగ్రమ్' 'కేజీఎఫ్' ఫ్రాంచైజీకి డార్క్ మూడ్ వర్కవుట్ అయింది కదా అని.. ప్రతీ సినిమాని అదే బ్యాక్ డ్రాప్ లో సెట్ చేస్తే ఆడియన్స్ కు బోర్ కొట్టే అవకాశం ఉంది. కొంత గ్యాప్ తీసుకొని చేస్తే ఓకే కానీ.. బ్యాక్ టూ బ్యాక్ అలాంటి సినిమాలే చేస్తే అదే ఫీల్ ని కలిగిస్తాయని భావించలేం. అందుకే ఈ అంశాలపై ప్రశాంత్ నీల్ ఆలోచించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఎప్పటికప్పుడు కొత్త విషయాలను అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రశాంత్ నీల్ కూడా అదే విధంగా ట్రై చేయడం మంచిదని సూచిస్తున్నారు. ఎమోషనల్ ఒకేలా ఉన్నా సెటప్పులు మారిస్తే మంచిదని అభిప్రాయ పడుతున్నారు.
అయితే ప్రశాంత్ నీల్ తన సినిమాలను డార్క్ మూడ్ లో సెట్ చేయడం వెనకున్న అసలు కారణం.. ఒకదానితో మరొకటి ముడిపెట్టడానికే అనేవారు కూడా ఉన్నారు. మల్టీవర్స్ సిరీస్ లో భాగంగా 'కేజీయఫ్' 'సలార్' 'NTR31' సినిమాల థీమ్ డార్క్ గ్రే కలర్ లో ఉన్నాయని.. హీరోలందరూ ఒకే విధమైన రగ్గుడ్ లుక్ లో కనిపిస్తున్నారని అంటున్నారు.
ఈ క్రమంలోనే 'కేజీయఫ్' లో గోల్డ్ మైనింగ్ బ్యాక్ డ్రాప్.. 'సలార్' చిత్రంలో కోల్ మైనింగ్ నేపథ్యాన్ని.. ఎన్టీఆర్ మూవీలో సరికొత్త బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారని.. ఈ పాత్రలన్నీ మల్టీవర్స్ లో ముడిపెడతారనే టాక్ నడుస్తోంది. ప్రశాంత్ నీల్ డార్క్ మూడ్ లో సినిమాలు చేయడానికి అసలు కారణం ఇదేనా? ఈ మూడు సినిమాల మధ్య సంబంధం ఉందా లేదా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
ఏదేమైనా ఒకే మూడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ.. భారీ అంచనాలను అందుకొని.. ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా మెప్పించాలంటే ఛాలెంజ్ తో కూడుకున్నదే అని చెప్పాలి. మరి టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఆ విషయంలో సక్సెస్ అవుతారో లేదో చూడాలి.