Begin typing your search above and press return to search.

ఇప్పుడు ఆ పిచ్చిలేదు ప్రశాంతమే: రానా

By:  Tupaki Desk   |   13 March 2021 12:44 PM GMT
ఇప్పుడు ఆ పిచ్చిలేదు ప్రశాంతమే: రానా
X
టాలీవుడ్ అందమైన జంటలలో దగ్గుబాటి రానా - మిహీక జంట ఒకటి. ఎప్పుడైతే వీరి ప్రేమను సోషల్ మీడియాలో ప్రకటించారో అప్పటినుండి వీరి పెళ్లి వరకు గ్యాప్ లేకుండా ఈ కపుల్ నేమ్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే గతేడాది కరోనా సమయంలో వీరిద్దరూ పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. పెళ్లి జరిగిన తర్వాత రానా - మిహికల పేర్లు తరచూ కాకుండా అప్పుడప్పుడు వినిపిస్తున్నాయి. అయితే రానా సినిమాలతో రెగ్యులర్ గా కనిపించినప్పటికి మిహీక మాత్రం అరుదుగా కనిపిస్తుంది. ఇటీవలే ఈ కపుల్ హ్యాండ్ ఇంప్రెషన్ గోల్డెన్ 3డి స్ట్రక్చర్ తయారు చేయించుకుని కెమెరా ముందు కనిపించారు. ఇదిలా ఉండగా.. పెళ్లికి ముందు రానా బ్యాచిలర్ లైఫ్ బాగానే ఎంజాయ్ చేసాడు.

స్నేహితులతో సందడి చేస్తూ.. బిఫోర్ మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేసిన రానా.. వివాహం తర్వాత ప్రశాంతంగా భార్య మిహీకతో స్థిరపడినట్లు అనిపిస్తుంది. ప్రస్తుతం రానా హ్యాపీ జోన్ లో ఉన్నాడు. ఇదివరకు రానా తన వర్క్, షూటింగ్స్ సంబంధించిన విషయాలను ఇంటికి తీసుకెళ్ళేవాడట. అలా చేసిన క్యారెక్టర్ పిచ్చిలోనే ఉండేవాడని స్వయంగా ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు రానా. అయితే వివాహం తర్వాత సినిమాల విషయాలను, పోషించిన క్యారెక్టర్స్ అలాగే ఇంటికి మోసుకెళ్లడం లాంటివి చేయడం లేదట. అలాగే ప్రశాంతంగా ఉండటం నేర్చుకుంటున్నట్లు చెబుతున్నాడు రానా. అంటే ఈ హీరో అటు సంసార జీవితాన్ని.. ఇటు ప్రొఫెషనల్ లైఫ్ రెండూ కూడా బాలన్స్ చేయడం తెలుసుకుంటున్నాడు. ప్రస్తుతం రానా అరణ్య, విరాటపర్వం అనే సినిమాలను పూర్తిచేసాడు. ఈ రెండు కూడా త్వరలో విడుదల కాబోతున్నాయి.