Begin typing your search above and press return to search.

మన డైరెక్టర్లు కథలతో రావొచ్చని క్లూ ఇచ్చిందన్నమాట!

By:  Tupaki Desk   |   4 Feb 2022 5:30 AM GMT
మన డైరెక్టర్లు కథలతో రావొచ్చని క్లూ ఇచ్చిందన్నమాట!
X
నార్త్ అమ్మాయిలు మన దగ్గరికి వచ్చి, మన సినిమాల్లో యాక్ట్ చేసి స్టార్స్ అవుతుంటారు. ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లి అక్కడ సినిమాలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆల్రెడీ బీటౌన్‌లో స్టార్ స్టేటస్‌ అనుభవిస్తున్న హీరోయిన్లు మనతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆల్రెడీ విద్యాబాలన్‌ ఎన్టీఆర్ బయోపిక్‌లో యాక్ట్ చేసింది. ‘ప్రాజెక్ట్‌ కె’ కోసం ప్రభాస్‌తో దీపిక జోడీ కట్టింది. త్వరలో జాన్వీ కపూర్ కూడా టాలీవుడ్‌లో అడుగు పెట్టబోతోంది.

ఇక ఆలియా భట్‌ అయితే మరింత స్పెషల్. ఆల్రెడీ ఓ తెలుగు సినిమాలో యాక్ట్ చేసేసింది. ఇప్పుడు మరో మూవీలో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘ఆర్‌‌ఆర్‌‌ఆర్’లో రామ్‌ చరణ్‌కి జంటగా నటించింది ఆలియా. తర్వాత ఆమె ఎన్టీఆర్, కొరటాల సినిమాలో నటించనుందంటూ వార్తలు వచ్చాయి. అయితే అఫీషియల్‌గా ఎవరూ కన్‌ఫర్మ్ అయితే చేయలేదు.

కానీ ఇప్పుడు స్వయంగా ఆలియానే ఈ విషయంపై పెదవి విప్పింది. ఇవాళ ముంబైలో జరిగిన గంగూబాయ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ ముప్ఫయ్యో సినిమాలో నటిస్తున్నారా అని ఒకరు అడిగిన ప్రశ్నకి ఆమె రియాక్టయ్యింది. ‘ఈ సినిమా ప్రపోజల్‌ని కొరటాల శివ నా దగ్గరకు తీసుకు రావడం నిజమే. చర్చలు జరుగుతున్నాయి. మా కాంబినేషన్‌ వర్కవుటవుతుందనే అనుకుంటున్నాను. దీని గురించి ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ చెప్పలేను’ అంది ఆలియా. ఆమె మాటల్ని బట్టి సినిమా కన్‌ఫర్మ్ అయ్యిందనే అనిపిస్తోంది.

ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలా బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాలకి కమిటవడం నిజంగా విశేషమే.ఇది మాత్రమే కాదు.. తెలుగులో కూడా వీలైనన్ని ఎక్కువ సినిమాల్లో నటించాలనుకుంటున్నాను అని కూడా స్పష్టం చేసింది ఆలియా. అంటే మన డైరెక్టర్లు కథలతో రావొచ్చని క్లూ ఇచ్చిందన్నమాట. ఈ అవకాశాన్ని మన ఫిల్మ్ మేకర్స్‌ ఉపయోగించుకుంటే ఆలియాని మరిన్ని తెలుగు సినిమాల్లో చూసే చాన్స్ లేకపోలేదు.