Begin typing your search above and press return to search.

NTR 30: రంగంలోకి బడా టెక్నీషియన్స్

By:  Tupaki Desk   |   31 Oct 2022 10:30 AM GMT
NTR 30: రంగంలోకి బడా టెక్నీషియన్స్
X
జూనియర్ ఎన్టీఆర్ RRR సక్సెస్ తర్వాత వెంటనే కొరటాల శివతో తన మరో సినిమాను మొదలు పెట్టాలని అనుకున్నాడు. అయితే స్క్రిప్టులో కొన్ని మార్పులు అవసరం కావడంతో ఎన్టీఆర్ పర్ఫెక్ట్ గా కథ సెట్ అయ్యేవరకు కూడా షూటింగ్ మొదలుపెట్టాలని అనుకోలేదు. అందుకే ఆ విధంగా ఈ ప్రాజెక్టు ఆలస్యం అవుతూ వచ్చింది. మొత్తానికి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలి అని ఇప్పుడు ఫిక్స్ అయినట్లు సమాచారం.

ఇక సినిమాలోని నటీనటులు అలాగే టెక్నీషియన్స్ అందరూ కూడా దాదాపు ఫైనల్ అయినట్లు కూడా తెలుస్తోంది. కానీ ఇప్పటివరకు అధికారికంగా అయితే ఎవరు కూడా పెద్దగా క్లారిటీ ఇచ్చింది లేదు. కానీ రీసెంట్ గా పీఆర్ టీమ్ నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఇద్దరు ప్రముఖ టెక్నీషియన్స్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో చాలా గ్రాండ్ గా తెరపైకి తీసుకురావాలని అనుకుంటున్నారు.

అయితే సినిమా కోసం ప్రముఖ సినిమాటోగ్రఫర్ రత్నవేలును ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే ఆర్ట్ డిజైనర్ బాహుబలి ఫేమ్ సాబు సిరిల్ ను కూడా ఫిక్స్ చేశారట. సినిమాను చాలా గ్రాండ్ గా తెరపైకి తీసుకురావాలని ఈ ఇద్దరు ప్రముఖ టెక్నీషియన్స్ ను ఫిక్స్ చేసుకున్నట్లుగా సమాచారం. త్వరలోనే ఫస్ట్ లుక్ టీజర్ తో మరొక క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నారు.

ఇక హీరోయిన్ విషయంలో అయితే ఇంతవరకు అధికారికంగా ఎక్కడ కూడా ప్రకటన ఇచ్చింది లేదు. కానీ రకరకాల పేర్లు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సినిమా షూటింగ్ మొదలైన తర్వాతనే హీరోయిన్ వివరాలు తెలియజేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ అయితే నవంబర్ లోనే మొదలయ్యే ఛాన్స్ ఉందట. ఇక షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తిచేసి సినిమాను వచ్చే ఏడాది చివర్లో లేదా 2024లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చు అని సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.