Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ 30 ఆ విషయంలో క్లారిటీ

By:  Tupaki Desk   |   8 Sep 2021 12:30 AM GMT
ఎన్టీఆర్ 30 ఆ విషయంలో క్లారిటీ
X
ఎన్టీఆర్‌ 30వ సినిమా గా కొరటాల శివ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ సినిమా ప్రారంభం కాబోతుంది. కొన్ని నెలల క్రితమే ఈ సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. ఎన్టీఆర్‌ అన్న కళ్యాణ్‌ రామ్‌ మరియు కొరటాల శివ సన్నిహితుడు సాయి సుధ బ్యానర్ లో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఆర్ ఆర్‌ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ నుండి రాబోతున్న సినిమా అవ్వడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా కోసం ఒక మంచి స్క్రిప్ట్‌ ను ఇప్పటికే కొరటాల రెడీ చేశారు అనేది టాక్‌. కరోనా వల్ల సినిమా షూటింగ్‌ ఆలస్యం అవుతుంది. ఎన్టీఆర్‌ మరియు కొరటాల ఇద్దరు కూడా వారి వారి ప్రాజెక్ట్‌ లను ముగించేశారు. దాంతో ఇద్దరి కాంబో మూవీ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అంటూ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా చిత్రీకరణ కోసం ముహూర్తం ఖరారు అయ్యిందట. మొదట దసరా సందర్బంగా సినిమా షూటింగ్‌ ప్రారంభించాలని భావించారు. కాని పలు కారణాల వల్ల సినిమా చిత్రీకరణ ఆరంభంకు కాస్త సమయం పడుతుంది. ప్రస్తుతం సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుంది. ఇక ఈ సినిమా పాన్‌ ఇండియా మూవీనా లేదా అనే డౌట్ చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఈమద్య కాలంలో పెద్ద హీరోలు అంతా కూడా పాన్ ఇండియా సినిమా అంటున్నారు. కాని కొరటాల శివ మాత్రం ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాల జోలికి వెళ్లలేదు. మొదటి సారి ఎన్టీఆర్ కోసం పాన్‌ ఇండియా స్క్రిప్ట్‌ ను కొరటాల రెడీ చేశాడు అనేది టాక్‌.

రామ్‌ చరణ్‌ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా సినిమాను చేస్తున్నాడు. అల్లు అర్జున్‌.. ప్రభాస్‌ లు వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ లు చేస్తున్నారు. ఈ సమయంలో ఎన్టీఆర్‌ నుండి వచ్చే ప్రతి సినిమా కూడా పాన్‌ ఇండియా మూవీనే అవుతుంది అనే నమ్మకంతో అభిమానులు ఉన్న ఈ సమయంలో కొరటాల టీమ్ నుండి ఈ స్పష్టత రావడంతో అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ సినిమాను వచ్చే సమ్మర్‌ లో విడుదల చేయాలని భావిస్తున్నారు. అక్టోబర్ లేదా నవంబర్‌ లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయితే విడుదల సమ్మర్ లో ఈజీ అవుతుంది. ఒక వేళ షూటింగ్‌ ఇంకా ఆలస్యం అయితే వచ్చే ఏడాదికి దసరాకు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.