Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ 30... ఫ్యాన్స్ ను కంగారు పెడుతున్న విషయాలు
By: Tupaki Desk | 14 May 2022 6:33 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత పాన్ ఇండియా స్టార్ డమ్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంతటి స్థాయి అంచనాలు ఉన్నప్పుడు తదుపరి సినిమా విషయంలో చిన్న డిటైల్ ను కూడా మిస్ కాకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. కాని ఎన్టీఆర్ కొన్ని విషయాలను లైట్ తీసుకుంటున్నాడేమో అనిపిస్తుందని కొందరు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అసలు విషయానికి వస్తే ఎన్టీఆర్ 30 సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. అపజయం ఎరగని కొరటాల శివ ఆచార్య సినిమా తో బొక్క బోర్లా పడ్డాడు. ఆయన ఆచార్య సినిమా ఫలితంను తల్చుకుని ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఆందోళన చాలదు అన్నట్లు సంగీత దర్శకుడు మరియు సినిమాటోగ్రాఫర్ విషయంలో కూడా ఎన్టీఆర్ నిర్ణయాలు సరిగా లేవు అంటూ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.
ఎన్టీఆర్ 30 కి తమిళ సంగీత సంచలనం అనిరుథ్ ను ఎంపిక చేయడం జరిగిందట. ఆయన ఇప్పటి వరకు తెలుగు లో కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకోలేక పోయాడు. తెలుగు లో ఆయన పాటలను జనాలు ఆధరించడం లేదు. అయినా కూడా తమిళనాట ఆయనకు ఉన్న గుర్తింపు మరియు స్టార్ డమ్ కారణంగా ఎన్టీఆర్ 30 కి తీసుకున్నారనే వార్తలు వస్తున్నాయి.
అనిరుథ్ కు ఎన్టీఆర్ ఓకే చెప్పడం వల్ల ఫలితం ఎలా ఉంటుందో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆచార్య ముందు వరకు కొరటాల శివ తన ప్రతి సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ తో వర్క్ చేశాడు. కనుక ఎన్టీఆర్ 30 కి కూడా దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు అయితే బాగుంటుంది అనేది కొందరి అభిప్రాయం. ఆ విషయంలో ఎన్టీఆర్ ఆలోచిస్తే బాగుంటుందని అభిమానులు అంటున్నారు.
ఇక ఈ సినిమాకు రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించబోతున్నాడు. ఆయన ఎంపిక విషయంలో కూడా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన ఎంపిక విషయంలో కూడా అభిమానులు ఒకింత అసంతృప్తితో ఉన్నారట. మొత్తానికి సంగీత దర్శకుడు మరియు సినిమాటోగ్రాఫర్ ఎంపిక అనేది ఎన్టీఆర్ అభిమానులకు కాస్త కంగారు పెడుతున్నట్లుగా తెలుస్తోంది.
ఎన్టీఆర్ తో కొరటాల శివ అంటేనే చాలా రిస్కీ ప్రాజెక్ట్ గా ఇప్పుడు అభిమానుల్లో చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో తెలుగు లో పెద్దగా సక్సెస్ రేటు లేని టెక్నీషియన్స్ ను ఎన్టీఆర్ 30 లో ఉండటం అనేది అస్సలు మంచి నిర్ణయం కాదు అనేది ఎన్టీఆర్ అభిమానుల అభిప్రాయం.