Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్30.. శ్రీవల్లి కి రూ.5 కోట్లు నిజమా?
By: Tupaki Desk | 15 Sep 2022 2:30 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా కు సంబంధించి రోజుకో వార్త అన్నట్లుగా వస్తూనే ఉన్నాయి. ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతోంది. ఆలస్యం అయినా కొద్ది వార్తలు వస్తూనే ఉన్నాయి. కథ విషయం.. నటీ నటుల విషయం.. టెక్నీషియన్స్ విషయంలో రెగ్యులర్ గా వార్తలను సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం.
తాజాగా ఈ సినిమా యొక్క హీరోయిన్ విషయమై ప్రచారం జరుగుతోంది. మొదట ఆలియా భట్.. జాన్వీ కపూర్ ల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఇతర బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ పేర్లను పరిశీలిస్తున్నట్లుగా పుకార్లు షికార్లు చేశాయి. కానీ ఇప్పటి వరకు అందుకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన కూడా రాలేదు. ఈ సమయంలో మరో పుకారు షికారు చేస్తోంది.
ఎన్టీఆర్30 సినిమా కోసం నేషనల్ క్రష్ రష్మిక మందన్నాని హీరోయిన్ గా ఎంపిక చేసేందుకు గాను కొరటాల శివ ఇటీవల ఆమెను సంప్రదించాడట. పుష్ప సినిమా తర్వాత జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న రష్మిక మందన్నా వల్ల ఎన్టీఆర్ 30 కి అదనపు ఆకర్షణ చేకూరడం ఖాయం.. ఆమె వల్ల ఉత్తర భారతంలో మరింతగా సినిమాకు బిజినెస్ అయ్య అవకాశాలు ఉన్నాయని కొరటాల భావిస్తున్నాడట.
కొరటాల ప్రపోజల్ కి రష్మిక ఓకే చెప్పింది కానీ తన పారితోషికం చెప్పి షాక్ ఇచ్చిందట. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అయిదు కోట్ల రూపాయల పారితోషికంను రష్మిక మందన్నా డిమాండ్ చేసిందని తెలుస్తోంది. పుష్ప సినిమా తో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఈ ముద్దుగుమ్మ మారిపోయింది. పైగా ఇప్పుడు తెలుగు మరియు తమిళంలో విజయ్ హీరోగా నటిస్తున్న వారసుడు సినిమాలో నటిస్తుంది.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. కనుక ఈ సమయంలో తన పారితోషికం అయిదు కోట్లుగా రష్మిక ఖరారు చేసింది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. రష్మిక కి ఉన్న క్రేజ్ మరియు ఆమె డిమాండ్ చేస్తన్నది సబబే అనే ఉద్దేశ్యంతో కొరటాల శివ ఎన్టీఆర్ 30 లో ఆమెని నటింపజేసేందుకు అంత పారితోషికం ఇచ్చేందుకు ఓకే చెప్పాడట.
ఈ విషయంలో ఆమె నుండి కానీ కొరటాల నుండి కాని ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. అయినా కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఊహించుకుంటూ.. ఇష్టానుసారంగా పుకార్లు పుట్టిస్తున్నారు. ఎన్టీఆర్ 30 గురించి గతంలో చాలా పుకార్లు వచ్చాయి.. మరి వాటి మాదిరిగానే రష్మిక 5 కోట్లు పుకారేనా.. లేదా నిజమా తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.