Begin typing your search above and press return to search.
NTR 30: తారక్ ఫైనల్ లుక్ ఇదేనా!
By: Tupaki Desk | 4 Jan 2023 5:30 AM GMTజూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమా ను త్వరలోనే స్టార్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై అభిమానుల్లో అయితే భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా కథ గురించి ఎంతో ఆలోచించి గాని ఫైనల్ చేయలేదు. అసలు కొరటాల శివ ఆచార్య సినిమాతో ఊహించని స్థాయిలో డిజాస్టర్ అందుకోవడంతో అసలు వీరి కలయికలో సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా వచ్చాయి.
కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కొరటాల శివపై నమ్మకంతో ఈ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఈ స్క్రిప్ట్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కు నచ్చే విధంగా కూడా దర్శకుడు ఎన్నో మార్పులు చేశాడు. ఫైనల్ గా స్క్రిప్ట్ అయితే సిద్ధమైంది. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టాలని అనుకుంటున్నారు.
అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫైనల్ లుక్ కూడా రెడీ అయినట్లుగా తెలుస్తోంది. రీసెంట్ గా ఒక ఫ్యాన్ తో దిగిన ఫొటో ద్వారా ఎన్టీఆర్ ఫైనల్ లుక్ ఇదే అని అనిపిస్తోంది. కొన్ని వారాల క్రితమే ఎన్టీఆర్ కొరటాల ఇద్దరు కలిసి ఫైనల్ లుక్ విషయంలో ఒక క్లారిటీ కి వచ్చేసారట. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ఫిట్నెస్ విషయంలోనే కాకుండా తన హెయిర్ స్టైల్ అలాగే నిండు గడ్డంతో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రెండో విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడట. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ లో పవర్ఫుల్ రాగ్ డ్ లుక్ కావాలి అని దర్శకుడు అడగడంతో ఎన్టీఆర్ కూడా అందుకు తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటున్నాడు. ఇక ఫిట్నెస్ విషయంలో మాత్రం కొంత బరువు పెరిగినట్లుగా అనిపిస్తోంది.
ప్రస్తుతం అయితే జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక ఫోటో వైరల్ గా మారింది. ఇటీవల ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లిన ఎన్టీఆర్ అక్కడ దిగిన కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ఒక ఫ్యాన్ తో దిగిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక దాదాపు ఇదే ఫైనల్ లుక్ అని అర్థమవుతుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.