Begin typing your search above and press return to search.
NTR 30: టెన్షన్ లేకుండా కొరటాల రెమ్యునరేషన్!
By: Tupaki Desk | 4 Jan 2023 2:30 AM GMTవరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్న కొరటాల శివకు ఆచార్య సినిమాతో ఊహించిన విధంగా దెబ్బ పడింది. ఆ సినిమా ఫ్లాప్ టాక్ అందుకోవడం మరొక దెబ్బ అయితే సినిమా బిజినెస్ వ్యవహారాలు కూడా అతనిపై తీవ్రతలు తీసుకువచ్చాయి. ఇంతకుముందు వరకు సినిమాలు సక్సెస్ అయ్యాయి కాబట్టి బిజినెస్ విషయంలో ఎన్నిసార్లు తలదూర్చిన కూడా కొరటాలకు పెద్దగా ఇబ్బంది రాలేదు.
కానీ ఆచార్య సినిమా డిజాస్టర్ కావడం వలన ఆ సినిమాకు దారుణంగా నష్టాలు వచ్చాయి. దీంతో డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా శివ మాటమీద అడిగినంత ఇచ్చే సినిమాను కొనుగోలు చేసుకున్నారు. ఇక కొరటాల శివ ఆ బిజినెస్ లో ప్రాఫిట్స్ కూడా తీసుకోవాలని అనుకున్నాడు. ఇంతకుముందు కూడా ప్రతి సినిమాకు అతను అదే తరహా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు.
అయితే ఆచార్య సినిమాకు మాత్రం ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. ఇక ఆ సినిమా ద్వారా చాలా రోజులపాటు డిస్ట్రిబ్యూటర్స్ తో చర్చలు జరిపి వారికి సెటిల్మెంట్ కూడా చేయాల్సి వచ్చింది. అయితే కొరటాల మళ్ళీ ఆ తప్పులు చేయకుండా ఎన్టీఆర్ సినిమాకు మాత్రం సైలెంట్ గా తనకు రావాల్సిన పారితోషికం తీసుకుని సైడ్ అయిపోతున్నట్లుగా తెలుస్తోంది.
ఎలాంటి బిజినెస్ వ్యవహారాల్లో కూడా ఇన్వాల్వ్ కాకుండా అతను పారితోషం తీసుకుంటున్నాడట. కొరటాల శివకు ఎన్టీఆర్ సినిమాకు గాను దాదాపు 25 కోట్ల వరకు రెమ్యునరేషన్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ 30వ సినిమాను ఈ సంక్రాంతి అనంతరం మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. ఇక సినిమా షూటింగ్ను వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తి చేసి. 2024 ఏప్రిల్ మొదట్లోనే సినిమాను విడుదల చేయాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.
కొరటాల శివ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి చాలా సమయం తీసుకోవాల్సి వచ్చింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో ఎన్టీఆర్ కూడా స్క్రిప్ట్ విషయంలో ఎంతగానో ఒత్తిడి తీసుకొచ్చాడు. ఇక ఆలస్యమైనప్పటికీ కూడా కొరటాల మాత్రం ఈ ప్రాజెక్టును భారీ స్థాయిలోనే తెరపైకి తీసుకురావాలని డిసైడ్ అయ్యాడు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.