Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ 30.. వచ్చేది అప్పుడేనా?
By: Tupaki Desk | 10 Nov 2022 1:30 AM GMT`జనతా గ్యారేజ్` వంటి సంచలన బ్లాక్ బస్టర్ తరువాత స్టార్ డైరెక్టర్ కొరటాల శివ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి ఓ భారీ పాన్ ఇండియా మూవీకి పని చేయబోతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ 30వ ప్రాజెక్ట్ గా తెరపైకి రానున్న ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై దర్శకుడు కొరటాల శివ స్నేహితులు మిక్కిలినేని సుధాకర్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు.
మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా డైలాగ్ మోషన్ టీజర్ ని విడుదల చేస్తూ ఈ ప్రాజెక్ట్ ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తామంటూ ప్రకటించారు. అయితే ఇంత వరకు ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లడం లేదు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు మేకర్స్ తో పాటు దర్శకుడు కొరటాల శివపై అసహనానికి గురవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇంత వరకు ఎలాంటి అప్ డేట్ లేదని, ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని వాపోతున్నారు.
ఈ నేపథ్యంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో వుందంటూ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ తో వున్న ఫోటోలని షేర్ చేసిన చిత్ర బృందం సినిమా ప్రారంభంపై ఇండైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చేసింది. `ఆచార్య` భారీ డిజాస్టర్ కావడంతో `ఎన్టీఆర్ 30`ని చాలా జాగ్రత్తగా చేయాలని గత కొన్ని నెలలుగా స్క్రీప్ట్ పై వర్క్ చేస్తున్న కొరటాల శివ ఎట్టకేలకు ఫైనల్ స్క్రిప్ట్ ని లాక్ చేసినట్టుగా తెలుస్తోంది.
సినిమాని త్వరలోనే లాంఛనంగా ప్రారంభించి డిసెంబర్ లేదా జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టాలనే ఆలోచనలో వన్నారట. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఫుల్ స్పీడుతో జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ పై కూడా మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చినట్టుగా తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీని వచ్చే దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారట. త్వరలోనే అనిరుధ్ తో కొరటాల శివ మ్యూజిక్ సిట్టింగ్స్ ని కూడా స్టార్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.