Begin typing your search above and press return to search.

NTR 30: ప్లాన్ మార్చిన కొరటాల శివ

By:  Tupaki Desk   |   18 Jun 2022 3:30 PM GMT
NTR 30: ప్లాన్ మార్చిన కొరటాల శివ
X
వరుసగా నాలుగు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకున్న కొరటాల శివ ఆ తరువాత ఆచార్య సినిమాలో కూడా అదే తరహాలో సక్సెస్ అందుకుంటాడు అని అందరూ అనుకున్నారు. ఆ సినిమా మొదలుపెట్టినప్పుడు అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిలో పెరిగిపోయాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ విడుదల తర్వాత మాత్రం ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకుంది. అసలు కొరటాల శివ సినిమా కెరీర్ లోనే అంత పెద్ద డిజాస్టర్ ను చూడలేదు.

అలాగే మెగా స్టార్ రామ్ చరణ్ ఇద్దరు కూడా ఆచార్య సినిమాతోనే అతి పెద్ద డిజాస్టర్ ను సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ 30వ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకుని ఫామ్ లోకి రావాలని అనుకుంటున్నాడు.

అయితే ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఒక ఆసక్తికరమైన టాక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఆ సినిమాలో ఈసారి కొరటాల శివ తన రెగ్యులర్ ఫార్మాట్ ను ఫాలో కావడం లేదని సమాచారం.

ఎలాంటి మెస్సేజ్ లేకండా పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించబోతున్నట్లు టాక్. కొరటాల శివ మొదటి నుంచి కూడా ప్రతీ సినిమాలో ఒక మంచి సందేశాన్ని తీసుకు వెళుతూ అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.

ఇక ఆచార్య సినిమాలో ఆ ప్లాన్ బెడిసికొట్టింది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ 30వ సినిమాలో పెద్ద కాన్వాస్ ఉన్న కథను చూపిస్తూ పక్కా మాస్ కమర్షియల్ అంశాలను హైలెట్ చేయబోతున్నట్లు సమాచారం.

ఎన్టీఆర్ పాత్ర కూడా హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో హైలెట్ అవుతుందట. ఇదివరకే సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు మంచి గుర్తింపు లబించింది. కొరటాల శివ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ఎన్టీఆర్ తో మళ్ళీ చాలా బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా షూటింగ్ ను మరికొన్ని రోజుల్లో స్టార్ట్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.