Begin typing your search above and press return to search.
#ఎన్టీఆర్ 30 పాయింట్ లీక్!
By: Tupaki Desk | 3 Nov 2022 4:30 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 2023 లోనే సినిమా రె గ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. స్ర్కిప్ట్ పరంగా తర్జనభర్జన జరుగుతోన్న నేపథ్యంలోనే ఈ డిలే జరుగుతోంది. తాజాగా ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి వైరల్ అవుతోంది. టైగర్-కొరటాల ఏకంగా మెడికల్ మాఫియానే టచ్ చేస్తున్నట్లు గుస గుస వినిపిస్తుంది.
కార్పోరేట్ వైద్యం కొత్త సవాళ్ల వైనాన్ని కళ్లకు కట్టబోతున్నట్లు సమాచారం. పేదల పాలిట కార్పోరేట్ వైద్యం ఖరీదు తీరును చూపిస్తూనే..అందుకు గల కారణాల్ని లోతుగా డిస్కస్ చేస్తూ కొరటాల మార్క్ సందేశాత్మక చిత్రనంగా మలుస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే టైగర్ 30తోనే ఆరకమైన హింట్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది.
`రక్తంతో తడిసి ముద్దైన చరిత్రే ఈనెల గుర్తు పెట్టుకుంటుంది. అతని నేల.. చరిత్ర అని . కానీ అతని రక్తం కాదు` అంటూ టీజర్ లో రివీల్ చేసారు. ఓ సంపన్నుడి చివరి క్షణాలు ధీన పరిస్థితుల్లో ఎలా ముగిసింది అనే కథని మెడికల్ మాఫియాకి అన్వయించి కొరటాల మార్క్ సెన్సిబిలిటీస్ తో మలుస్తున్నట్లు గుస గుస వినిపిస్తుంది. ఎన్టీఆర్ ఈ పాయింట్కి కనెక్ట్ అవ్వడంతో స్ర్కిప్ట్ డెవలెప్ మెంట్ ఆ రకంగా మలుస్తున్నట్లు లీకులందుతున్నాయి.
వాస్తవానికి ఈ పాయింట్ ని సీమ్ నేపథ్యంలో అనుకోవడంతో ట్రైలర్ ఆరకంగా కట్ చేసారు..ఇప్పుడు అందులోనే మూల కథని మారుస్తున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తుంది. స్ర్కిప్ట్ కి ఈ సంబంధించిన పనులు మరో మూడు నెలలు పాటు కొనసాగుతాయని..ఆ తర్వాత సినిమా ప్రారంభం అవుతుందని భొగట్టా. మరి ఇందులో వాస్తవాలు తెలియాల్సి ఉంది.
ఇదే నిజమైతే మెడికల్ మాఫియాపై కొరటాల శమర శంఖం పూరించినట్లే. ఇదే నేపథ్య ఆధారంగా గతంలో `గణేష్`..`ఠాగూర్` లాంటి సినిమాలు తెరకెక్కాయి. ఆయా సినిమాల్లో కొన్నిచోట్లే ఆపాయింట్ ని బలంగా టచ్ చేసారు. కానీ కొరటాల మాత్రం మెడికల్ వ్యవస్థనే ప్రశ్నించేలా? బలమైన కంటెంట్ తో టచ్ చేసే అవకాశం ఉంది. మెడికల్ మాఫియాలో బయట ప్రపంచానికి తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. కాలం మారుతోన్న కొద్ది ఆ రకమైన మాఫియా కూడా అప్ డేట్ అవుతోంది. మరి కొరటాల తీసుకున్న పాయింట్ ఇదే అయినా? బలంగా చెప్పగలిగినా? టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.