Begin typing your search above and press return to search.
బాలీవుడ్ ని షేక్ చేస్తున్న తారక్ 30!
By: Tupaki Desk | 20 May 2022 9:31 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ చిత్రం కొరాటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిన్నటి రోజున తారక్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ తో యంగ్ టైగర్ అభిమానులకు బిగ్ ట్రీట్ ఇచ్చారు. సముద్రం బ్యాక్ డ్రాప్..తారక్ వాయిస్ ఓవర్ ఓ రేంజ్ లో హైలైట్ అయింది. ఒక్క మోషన్ పోస్టర్ తోనే తారక్ 30ని ఒక్కసారిగా అలా పైకి లేపారు.
యంగ్ టైగర్ ఇమేజ్ కి ఏ మాత్రం తగ్గకుండా కొరటాల మార్క్ యాక్షన్ ఫ్యాక్డ్ ఎంటర్ టైనర్ అని తేలిపోయింది. ప్రస్తుతం మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే పోస్టర్ ని హిందీ వెర్షన్ లో నూ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మరి అక్కడ టాక్ ఏంటి? అంటే అక్కడా అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. సౌత్ కిధీటుగా నార్త్ ఆడియన్స్ నుంచి సైతం మంచి ఆదరణ దక్కుతోంది.
తారక్ వాయిస్ ఉత్తరాది ప్రేక్షకుల్ని ఫిదా చేస్తోందని వ్యూస్..లైక్స్ ని బట్టి తెలుస్తుంది. దీంతో తారక్ హిందీ బెల్ల్ లో ఎంత పాపులర్ అయ్యారో అర్ధమవుతోంది. `ఆర్ ఆర్ ఆర్` సినిమాతో యంగ్ టైగర్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన సంగతి తెలిసిందే. కొమరం భీమ్ పాత్రలో ఆద్యంతం ఆకట్టుకున్నారు. తారక్ పాత్ర విషయంలో అంత ప్రాముఖ్యత లేదని విమర్శలొచ్చినప్పటికీ ఆ ప్రభావం తారక్ ఇమేజ్ పై ఏమాత్రం ఇంపాక్ట్ చూపలేదని తాజా సన్నివేశాన్న బట్టి అంచనా వేయోచ్చు.
అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాత్రతో పోలిస్తే తారక్ పాత్ర అంత ధీటుగా లేదన్నది కొంత వరకూ వాస్తవమే. కానీ నటుడిగా తారక్ ఉన్నతంగానే కనిపించారు. ఒక్క హిట్ తోనే తారక్ ఉత్తరాది ఆడియన్స్ మనసు దోచాడని మెషన్ పోస్టర్ తో అర్ధమవుతుంది. ఈ చిత్రానికి కొరటాల పాన్ ఇండియాలోనే ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.
హిందీ లో మోషన్ పోస్టర్ ప్రత్యేకంగా రిలీజ్ చేసారంటే దాని వెనుక అంతరార్ధం బాలీవుడ్ టార్గెట్ గానే బరిలోకి దిగుతున్నట్లు గుస గుస వినిపిస్తుంది. మరో రెండు నెలల్లో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. గతంలో తారక్ -కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కిన `జనతా గ్యారేజ్` బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.
తారక్ కెరీర్ లోనే భారీ వసూళ్లు సాధించిన చిత్రంగాల జనతా గ్యారేజ్ నిలిచింది. ఇప్పుడా రికార్డులన్నింటిని యంగ్ టైగర్ 30వ చిత్రం బ్రేక్ చేస్తుందని అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో యవసుధ ఆర్స్ట్ నిర్మిస్తుంది.