Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ కు అన్న బ్యానరే హోం బ్యానర్
By: Tupaki Desk | 14 April 2021 4:30 AM GMTటాలీవుడ్ లో యంగ్ స్టార్ హీరోల నుండి చిన్న హీరోలు సీనియర్ హీరోల వరకు అందరికి కూడా ప్రొడక్షన్ హౌస్ లు ఉన్నాయి. తమ పేరుతో కాకున్నా తమ కుటుంబ సభ్యుల పేర్లతో బ్యానర్ లు నడుపుతున్న హీరోలు చాలా మంది ఉన్నారు. ఇండస్ట్రీలో ఎక్కువ శాతం హీరోలకు హోం బ్యానర్ లు ఉన్నాయి. మహేష్ బాబు.. పవన్ కళ్యాణ్.. చరణ్.. ప్రభాస్... బన్నీ ఇలా దాదాపు అందరు స్టార్‌ల కు హోం బ్యానర్ లు ఉన్నాయి. అలాగే ఎన్టీఆర్ కు కూడా హోం బ్యానర్ ఉంది. అయితే అది తన అన్న కళ్యాణ్ రామ్ బ్యానర్. ఎన్టీఆర్ సొంతంగా ఒక బ్యానర్ ను ఏర్పాటు చేసుకుంటేనే ఆర్థికంగా లాభపడుతాడు. కాని అన్న కళ్యాణ్ రామ్ పరిస్థితి నేపథ్యంలో ఆయన్ను సెటిల్ చేసేందుకు ఆయన బ్యానర్ ను తన హోం బ్యానర్ గా చేసుకుని అన్న కళ్యాణ్ రామ్ కు లాభాల పంట పండిస్తున్నాడు.
జై లవకుశ సినిమా తో కళ్యాణ్ రామ్ భారీ లాభాలను దక్కించుకున్నాడు. సినిమా యావరేజ్ గా నిలిచినా కూడా మంచి వసూళ్లను దక్కించుకుని లాభాలను తెచ్చి పెట్టింది. ఇతర హీరోలు అంతా కూడా తాము నటిస్తున్న సినిమాల్లో తమ హోం బ్యానర్ ను ఇన్వాల్వ్ చేస్తుంది. పెట్టుబడి తక్కువ పెట్టి లాభాల్లో వాటాను తీసుకునేలా ఒప్పందం చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత చేయాలనుకున్న త్రివిక్రమ్ మూవీ కి హారిక అండ్ హాసిని బ్యానర్ తో కలిసి కళ్యాణ్ రామ్ ను నిర్మాతగా ప్లాన్ చేశాడు. కాని అనూహ్యంగా ఎన్టీఆర్30 దర్శకుడు మారాడు.
ఎన్టీఆర్ 30కి త్రివిక్రమ్ దర్శకత్వం వహించాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకున్నాడు. కొరటాల శివ రంగంలోకి దిగబోతున్నాడు. ఈ సినిమాకు కొరటాల సన్నిహితుడు మిక్కిలినేని నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా నిర్మాణంలో మిక్కిలినేనితో పాటు కళ్యాణ్ రామ్ ను కూడా ఎన్టీఆర్ మళ్లీ రంగంలోకి దించాడు. తన హోం బ్యానర్ అయిన అన్న బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో ముందు ముందు మరిన్ని సినిమాలు ఉంటాయని ఎన్టీఆర్ సన్నిహితులు అంటున్నారు.