Begin typing your search above and press return to search.
ఇంతలోనే `ఎన్టీఆర్ - కొరటాల` కథ లీక్
By: Tupaki Desk | 15 April 2021 11:30 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిన `జనతా గ్యారేజ్` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఆ సినిమా కథ పాత్రల తీరుతెన్నుల గురించి రిలీజ్ తర్వాత చాలా కాలం పాటు అభిమానుల్లో చర్చకు తావిచ్చాయంటే వాటి ప్రభావం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ హీరోగా కొరటాల తెరకెక్కించే సినిమా కథాంశం ఎలా ఉండనుంది.. తారక్ పాత్ర ఎలా ఉండనుంది? అంటూ అభిమానుల్లో క్యూరియాసిటీ నెలకొంది.
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నారని ప్రకటన వెలువడగానే వెంటనే దీనిపై ఆరాలు మొదలయ్యాయి. ఆ ప్రకటనతోనే తారక్ అభిమానులు ఎంతో సంతోషించారు. నాటి నుంచి ఫ్యాన్స్ కంటికి కునుకు కరువైందట. అసలు ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఎలా కనిపిస్తారు? అనే దాని గురించి చాలా ఆసక్తిగా ముచ్చటించుకుంటున్నారు. ఇందులో ఎన్.టి.ఆర్ ఒక చిన్న టౌన్ నుంచి పెద్ద నగరానికి వచ్చి పరిస్థితుల కారణంగా అసాధారణంగా మారతారని.. ఆ తరవాత కథేంటో తెరపైనే చూడాలని చెబుతున్నారు.
ఈ కథాంశం వినేందుకు చాలా సింపుల్ గా రొటీన్ గా అనిపించినా కొరటలా ఎన్టీఆర్ ను చూపించే తీరు వైబ్రేంట్ గా ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఎప్పటిలానే కొరటాల మార్క్ మెసేజ్ ఉంటుంది. జనతా గ్యారేజ్- శ్రీమంతుడు- భరత్ అనే నేను సినిమాల్లో ఉండే టింజ్ మిస్సవ్వదన్న టాక్ వినిపిస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రొటీన్ కి భిన్నంగా విభిన్నమైన పాత్రలు చేయాలనుకుంటున్నారు. కొరటాల వంటి దర్శకులకు వెంటనే ఓకే చెప్పడానికి కారణమిదే.