Begin typing your search above and press return to search.
యంగ్ టైగర్-కొరటాల మరో `మహర్షి`ని మరిపిస్తారా!
By: Tupaki Desk | 19 Sep 2021 2:30 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించనున్న తన 30వ చిత్రానికి కొరటాల శివ దర్శకుడిగా లాక్ అయిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్స్ట్-యువసుధ ఆర్స్ట్ పై కళ్యాణ్ రామ్- సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని భారీ కాన్సాస్ పై పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది వంటి సమాచారం లోపించింది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ అందింది. అన్ని అనుకున్నట్లు గనుక జరిగితే అక్టోబర్ 30న చిత్రాన్ని ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారుట.
అటుపై రెగ్యులర్ షూటింగ్ ని నవంబర్ రెండవ వారం నుంచి ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ నటి అలియాభట్ ని తీసుకోవాలని సంప్రదింపులు జరుపుతున్నారుట. అలియా `ఆర్ ఆర్ ఆర్` చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సరసన నటిస్తోంది. `ఆర్ ఆర్ ఆర్` లో తారక్ కూడా నటిస్తుండటంతో అలియా ఎంపికపై ఆసక్తి చోటుచేసుకుంది. చరణ్ తర్వాత అమ్మడు రెండవ సినిమాగా తారక్ తో రొమాన్స్ చేయడం క్యూరియాసిటీ రెట్టింపు చేస్తుంది. ఇక ఈ కాంబోలో చక్కని సందేశాత్మక చిత్రం తెరకెక్కనుందని..పక్కా కొరటాల మార్క్ సినిమా అని వినిపిస్తోంది.
ఇందులో తారక్ సాధారణ విద్యార్ధి నుంచి ఓ కార్పోరేట్ కంపెనీ సీఈవోగా ఎదిగిన వైనాన్ని స్ఫూర్తిదాయకంగా మలుస్తున్నట్లు సమాచారం. ఇలాంటి జానర్లో ఇప్పటికే `మహర్షి` తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో ఓ తెలివైన విద్యార్థి కంపెనీ సీఈవో గా అటుపై సామాజిక స్ఫృహ గల ఎన్ ఆర్ ఐని చూపించారు. ఈ నేపథ్యంలో కొరటాల కన్సెప్ట్ `మహర్షి`ని పోలినట్లు కనిపిస్తుంది. ఇలాంటి జానర్రలు కొరటాలకు కొట్టిన పిండి. సెన్సిటివ్ గా తెరకెక్కిస్తారు. గతంలో ఆయన తెరకెక్కించిన `శ్రీమంతుడు`.. `జనతా గ్యారేజ్` చిత్రాలు ఎంతో స్ఫూర్తిదాయకం. శ్రీమంతుడులో గ్రామాల దత్తత.. గ్యారేజ్ లో మనిషిలో మానవత్వం అనే రెండు కాన్సెప్ట్ ల మీద ఆ రెండు చిత్రాల్ని అద్భుతంగా కమర్శిలైజ్డ్ చేసి సక్సెస్ లు అందుకున్నారు. ఈ నేపథ్యంలో తారక్ 30పై భారీ అంచనాలు నెలకొంటున్నాయి.