Begin typing your search above and press return to search.
NTR 31 ..`యూరి` టైప్ కనెక్షన్.. డ్యూయల్ షేడ్ రోల్!!
By: Tupaki Desk | 2 Jun 2021 4:31 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన కెరీర్ 30వ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తదుపరి కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్రాజెక్ట్ కోసం రెడీ కావాల్సి ఉంటుంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఎన్టీఆర్ 31 కథాంశం ఎలా ఉంటుంది? అన్నదానిపై అభిమానుల్లో రకరకాలుగా చర్చ సాగుతోంది.
తాజా సమాచారం మేరకు తారక్ ని ఈ చిత్రంలో డ్యూయల్ షేడ్ ఉన్న పాత్రలో చూపిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దేశభక్తి తీవ్రవాదం రాజకీయం అనే ఎలిమెంట్స్ ని ప్రభావవంతంగా టచ్ చేసే స్క్రిప్ట్ తో ప్రశాంత్ నీల్ రంగం సిద్ధం చేస్తున్నారన్నది తాజాగా అందిన లీక్. ఇక పాకిస్తానీ తీవ్రవాదం అనగానే బ్లాక్ బస్టర్ మూవీ `యూరి` టైప్ కనెక్షన్ కూడా ఇందులో ఉంటుందా? అన్నది చర్చల్లోకొస్తోంది. ఇక ఇదే చిత్రంలో రాజకీయ నాయకుడిగానూ తారక్ లో డ్యూయల్ షేడ్ చూపిస్తారట. ఈ చిత్రంలో గ్రిప్పింగ్ యాక్షన్ తో ఇండియా-పాకిస్తాన్ సెటప్ అగ్గి రాజేస్తుందట.
ఇది సీరియస్ డ్రామా.. ఎన్.టి.ఆర్ ను శక్తివంతమైన రాజకీయ నాయకుడిగా చూపిస్తారు. తీవ్రవాదులతో బ్రూటల్ గేమ్ ఆడే నాయకుడిలోని షేడ్ ఆద్యంతం రక్తి కట్టిస్తుందని చెబుతున్నారు. ఎంచుకున్న కథాంశంలోనూ యూనివర్శల్ అప్పీల్ ఉండేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది. బ్యాక్ డ్రాప్ లు రెండూ ధృఢంగా కనిపిస్తాయి. ఇప్పటివరకూ తారక్ లో చూడని కొత్త కోణం ఈ సినిమాలో చూస్తారని టాక్ వినిపిస్తోంది. అతడు ఈ తరహాలో ఇప్పటి వరకు ప్రయత్నించలేదు కాబట్టి ఫ్యాన్స్ కి ఎగ్జయిటింగ్ గా ఉంటుందని చెబుతున్నారు. అయితే ప్రశాంత్ నీల్ స్వయంగా దీనిని కన్ఫామ్ చేయాల్సి ఉంటుంది.