Begin typing your search above and press return to search.
రోజుకి 42 జతలు మారుస్తున్న ఎన్టీఆర్
By: Tupaki Desk | 27 July 2017 5:56 AM GMTఇప్పుడు తన కొత్త సినిమా కోసం చాలా కొత్తగా కసరత్తులు చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అసలే మన తెలుగు సినిమాల్లో హీరోలు డబుల్ రోల్స్ చేయడం ఈ మధ్యకాలంలో పెద్దగా కనిపించట్లేదు. అటువంటిది మనం ట్రిపుల్ రోల్స్ లో మన హీరోలను చూసి చాలా కాలమే అయ్యింది. అప్పుడెప్పుడో ఎన్టీఆర్.. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి వంటి వారే ఇలా ట్రిపుల్ రోల్స్ టేకప్ చేశారు. ఇప్పుడు ఇలాంటి తరహా ట్రిపుల్ రోల్ లో జూనియర్ ''జై లవకుశ'' సినిమాతో టాలెంట్ చూపించబోతున్నాడు.
ప్రస్తుతం పూణెలో ఈ సినిమా తాలూకు పాటను ఒక మహల్ లో షూటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పాట కోసం ఎన్టీఆర్ కాస్త గట్టిగా కష్టపడాల్సి వస్తుందట. ఎందుకంటే ఒకేసారి ఈ పాటలో మూడు క్యారక్టర్లూ కనిపిస్తాయి. కాబట్టి ఆయన మూడు పాత్రల కోసం రకరకాలు హావభావాలు బాడీ లాంగ్వేజ్ మార్చడమే కాదు.. ఖచ్చితంగా బట్టలు కూడా మార్చాలిగా. మొన్న ఒక రోజైతే ఏకంగా మనోడు ఒక్కో క్యారెక్టర్ కోసం షుమారుగా 12 బట్టలు మారుస్తూ.. ఒక రోజులో ఏకంగా 42 రకాల జతలను వేసుకున్నాడట. మార్చిన ప్రతీసారి స్టయిలింగ్ కూడా మార్చాలి. అలాగే నటుడిగా ఆ క్యారక్టర్లలో ఒదిగిపోవాలి. ఇది నిజంగా పెద్ద ఛాలంజనే చెప్పాలి.
అయితే ఇప్పటికాలంలో విజువల్ ఎఫెక్ట్స్ సౌలభ్యం బాగా పెరిగిపోవడంతో.. ఒకసారి ఒకలా తీసిన షాటును మళ్లీ అదే తరహాలో కెమెరాలో ఎన్నిసార్లైనా రిపీట్ చేయొచ్చు కాబట్టి.. యాక్టర్లు పొజిషన్లు మారిపోయి ఈజీగా సీన్ చేయవచ్చు. ఆ మధ్యన అమీర్ ఖాన్ ధూమ్ 2 కోసం ఇదే తరహాలో చేశాడు. ఇప్పుడు జూనియర్ కూడా అదే టెక్నాలజీకి తన నటనాచాతుర్యం మిక్స్ చేసి రెచ్చిపోతున్నాడట.