Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌, ఆమీర్‌ ఖాన్ కలిసి నటిస్తే.. ఇంట్రెస్టింగ్‌ రూమర్స్‌

By:  Tupaki Desk   |   27 Dec 2022 5:31 AM GMT
ఎన్టీఆర్‌, ఆమీర్‌ ఖాన్ కలిసి నటిస్తే.. ఇంట్రెస్టింగ్‌ రూమర్స్‌
X
యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెల్సిందే. కొరటాల శివ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. సంక్రాంతి తర్వాత సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎన్టీఆర్‌ అభిమానులు ఎక్కువ శాతం మంది కొరటాల శివ సినిమా కంటే ఆ తర్వాత ఎన్టీఆర్ చేయబోతున్న సినిమాపై ఆసక్తి పెంచుకుని ఉన్నారు.

కొరటాల శివ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ చేయబోతున్న సినిమా ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో రూపొందబోతున్న విషయం తెల్సిందే. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ కూడా విడుదల అయ్యి ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించాడు.

ప్రస్తుతం సలార్‌ సినిమాను చేస్తున్న ప్రశాంత్‌ నీల్ ఆ తర్వాత అంటే వచ్చే ఏడాది ద్వి తీయార్థం ఆరంభంలోనే ఎన్టీఆర్‌ సినిమా ను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఎన్టీఆర్‌ తో ప్రశాంత్‌ నీల్‌ చేయబోతున్న సినిమా లో బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ఆమీర్ ఖాన్ నటించే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇంట్రెస్టింగ్‌ పుకారు షికారు చేస్తోంది.

ప్రశాంత్ నీల్‌ రెడీ చేసిన కథలో ఒక సీనియర్ హీరో కు స్కోప్ ఉన్న పాత్ర ఉందట. ఆ పాత్రను ఆమీర్ ఖాన్‌ చేస్తానంటే నిడివి పెంచి మరింత స్ట్రాంగ్ గా కథను సిద్ధం చేయాలని ప్రశాంత్ నీల్‌ భావిస్తున్నాడట. కేజీఎఫ్ సినిమా తో సత్తా చాటిన ప్రశాంత్‌ నీల్‌ అడిగితే కచ్చితంగా ఆమీర్ ఖాన్ నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఆమీర్ ఖాన్ మరియు ఎన్టీఆర్‌ కలిసి నటిస్తే కచ్చితంగా అదో అద్భుతం అన్నట్లుగా నిలుస్తుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చర్చ మొదలు అయ్యింది. అతి త్వరలోనే మరింతగా ఈ సినిమా గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.