Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్.. బన్ని.. తొలి ఛాన్స్ ఎవరిస్తారు?
By: Tupaki Desk | 21 April 2019 4:35 AM GMTక్రికెట్ నేపథ్యంలో ఆద్యంతం ఎమోషనల్ టచ్ తో తెరకెక్కించిన `జెర్సీ`కి క్రిటిక్స్ నుంచి యునానిమస్ గా ప్రశంసలు దక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలి వీకెండ్ చక్కని వసూళ్లు దక్కించుకోనుందని ట్రేడ్ చెబుతోంది. జెర్సీ టీమ్ ప్రస్తుతం ఎంతో ఎగ్జయిట్ మెంట్ తో ఉందని సితార ఎంటర్ టైన్ మెంట్ ఆఫీస్(ఫిలింనగర్) లో ముఖాలు చూస్తే తెలిసిపోతోంది. వారం పాటు పూర్తిగా కన్ఫ్యూజన్ లోనే ఉంటానని గౌతమ్ తిన్ననూరి ఓ ఇంటర్వ్యూలో ఎంతో ఎగ్జయిట్ అవుతూ అన్నారు. జెర్సీ రిలీజైన రోజే తొలిగా తనకు ఓ ఇద్దరు అగ్ర హీరోల నుంచి కాంప్లిమెంట్లు అందాయి. ఇంతకంటే ఒక దర్శకుడికి ఏం కావాలి? అంటూ ఎగ్జయిట్ అయ్యారు గౌతమ్. కాంప్లిమెంట్లు ఇచ్చిన ఆ ఇద్దరూ ఎన్టీఆర్.. అల్లు అర్జున్.
ప్రస్తుతం ఆ ఇద్దరి ప్రశంసల గురించి పరిశ్రమలో ఆసక్తికర చర్చ సాగుతోంది. జెర్సీ పై ప్రశంసలు కురిపించిన తొలి హీరో తారక్. సితార ఎంటర్ టైన్ మెంట్స్ .. హారిక & హాసిని క్రియేషన్స్ తో అనుబంధం ఉన్న హీరోగా తారక్ ఈ కాంప్లిమెంట్ ఇచ్చారనే అంతా భావించారు. అయితే అదొక్కటే కారణం కాదని తెలుస్తోంది. నవతరం దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తారక్ కి జెర్సీ రిలీజ్ కంటే ముందే కథ చెప్పారట. గౌతమ్ సెన్సిబిలిటీస్ నచ్చాయని తారక్ ప్రశంసలు కురిపించారని తెలిసింది. ప్రస్తుతం దీనిపై మీడియాలోనూ చర్చ సాగుతోంది.
జెర్సీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు.. మరి తారక్ ఛాన్సిస్తారా? అంటే గౌతమ్ తిన్ననూరి బౌండ్ స్క్రిప్ట్ దానిని డిసైడ్ చేస్తుందని మాట్లాడుకుంటున్నారు. ఇటీవల హీరోలు పూర్తి స్క్రిప్టుతో వస్తేనే ఓకే చెబుతున్నారు. ఇప్పటివరకూ గౌతమ్ తిన్ననూరి వేరొక ప్రాజెక్టుకు కమిట్ కాలేదు. తనవద్ద స్టోరీ బ్యాంక్ లో కావాల్సినన్ని కథలు ఉన్నాయి. వాటిని బ్రషప్ చేయాల్సి ఉంటుందిట. ఇక తారక్ ప‌్రస్తుతానికి ఆర్.ఆర్.ఆర్ తో బిజీ. ఆ తర్వాత స్టార్ డైరెక్టర్లు క్యూలో ఉన్నారు. అయితే స్టార్ డైరెక్టర్ల కంటే యూనిక్ స్టోరీని సెలక్ట్ చేసుకుంటే గౌతమ్ కే ఆ ఛాన్స్ దక్కే అవకాశం ఉంటుంది. ఈ యువదర్శకుడిని ప్రశంసించిన మరో అగ్రకథానాయకుడు అల్లు అర్జున్. తనకు కూడా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ - సితార ఎంటర్ టైన్ మెంట్స్ తో అనుబంధం ఉంది. ప్రస్తుతం త్రివిక్రమ్ తో చేస్తున్నది హారిక బ్యానర్ లోనే. అలాగే బన్ని ప్రయోగాత్మకంగా ఆలోచించే దర్శకులకు తొలి నుంచీ అవకాశాలిస్తున్నారు. యూనిక్ కథలు వినిపిస్తే కొత్త కుర్రాళ్లు అయినా ఛాన్సులిచ్చే గట్స్ ఉన్న హీరో. అయితే జెర్సీ డైరెక్టర్ కి బన్ని ఛాన్సిస్తారా? అంటే.. కథే అన్నిటికీ డిసైడింగ్ ఫ్యాక్టర్. బౌండ్ స్క్రిప్టుతో మెప్పిస్తేనే ఛాన్సుంటుంది. అయితే బన్ని క్యూలో ఇప్పటికే మూడు సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ పూర్తయితే కానీ అతడితో ఛాన్స్ దక్కకపోవచ్చు. ఈలోగానే యూనిక్ కాన్సెప్టుతో బన్నీని గౌతమ్ మెప్పిస్తారేమో చూడాలి. మునుముందు యూనిక్ సబ్జెక్టులపైనే కసరత్తు చేస్తానని మీడియా ముందు ప్రకటించారు గౌతమ్.