Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ చుట్ట ఏఎన్నార్ వెలిగించిన వేళ..
By: Tupaki Desk | 24 Jan 2016 9:30 AM GMTకొన్ని ఫొటోలకు వర్ణనలు అవసరం లేదు. చూడగానే ఫ్లాటైపోతాం. కొంతసేపు అలా చూస్తూనే ఉండిపోతాం. అలాంటి ఫొటోనే ఇది కూడా. తెలుగు సినీ పరిశ్రమకు రెండు కళ్లు అనదగ్గర నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావుల మధ్య బంధాన్ని తెలిపే దృశ్యమిది. ఎన్టీఆర్ కు ఏఎన్నార్ ప్రేమతో సిగరెట్ వెలిగిస్తున్న ఫొటో.. సెన్సేషనల్ అంటే సెన్సేషనలే లెండి. ఆల్రెడీ తనో సిగరెట్ చేతిలో పెట్టుకుని ఎన్టీఆర్ కు సిగరెట్ వెలిగిస్తున్నారు ఏఎన్నార్. వీళ్లిద్దరూ పొగ బానిసలేమీ కాదు కానీ.. ఏదో ఒక సందర్భంలో ఇలా సరదాగా సిగరెట్ తాగుతూ కనిపిస్తే క్లిక్ మనిపించారు. ఇద్దరూ అగ్ర హీరోలే అయినా.. ఎన్టీఆర్ - ఏఎన్నార్ ఇగోలేమీ లేకుండా ఎన్నో సినిమాల్లో కలిసి పని చేశారు. ఎంతో స్నేహంగా మెలిగారు. వ్యక్తిగత జీవితంలోనూ ఇద్దరికీ ఎంతో అనుబంధముంది. ఆ అనుబంధానికి ఈ ఫొటో ఓ తార్కాణం అని చెప్పొచ్చు.